YS Jagan: వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. 'జమిలి వస్తుంది మీ జగన్ గెలుస్తున్నాడు!'

Ex CM YS Jagan First Reaction On One Nation One Election: జమిలి ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు రానున్నాయని.. మళ్లీ తాను గెలుస్తున్నట్లు ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫుల్‌ ఖుషీ అయ్యారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 24, 2024, 07:18 PM IST
YS Jagan: వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. 'జమిలి వస్తుంది మీ జగన్ గెలుస్తున్నాడు!'

Andhra Pradesh Elections: ఒక దేశం ఒక ఎన్నికతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎన్నికలు రానున్నాయని.. తాను గెలవబోతున్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2027లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలతోనే ఏపీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.

Also Read: TTD Decisions: టీటీడీ కీలక నిర్ణయాలు.. ప్రతి రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మాణం

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనేందుకు కడప జిల్లాలోని స్వగ్రామం పులివెందులకు మాజీ సీఎం జగన్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్సార్‌ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కడప జిల్లా నాయకులు, కార్పొరేటర్లతో వైఎస్‌ జగన్‌ సమావేశమై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆ సమయంలోనే జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'కష్టాలు అనేవి శాశ్వతం కావు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. మనమందరం కలిసికట్టుగా పని చేయాలి' అని శ్రేణులకు చెప్పారు. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నామని ఎన్నికల ఫలితాలపై మరోసారి ప్రస్తావించారు.

Also Read: Kadapa Mayor: మళ్లీ మేయర్ వర్సెస్‌ టీడీపీ ఎమ్మెల్యే మధ్య రచ్చరచ్చ.. 'కడప'లో కుర్చీల లొల్లి

కార్యకర్తలు కాలర్‌ ఎగరేసుకునేలా పాలన చేశామని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చామని పేర్కొన్నారు. '2027 చివరలో జమిలి ఎన్నికలు రావొచ్చు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం' అని తెలిపారు. 'మాట మీద నిలబడితే ప్రజలు వాస్తవాలు తెలుసుకుని ఆదరిస్తారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా నిత్యం ప్రజల కోసమే పోరాడాలి' అని పార్టీ శ్రేణులకు వైఎస్‌ జగన్‌ సూచించారు. ఎన్నికలకు ముందు అలవి గానీ హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు.

'కళ్లు మూసుకుని ఆరు నెలలు అయిపోయాయి. ఇంకొన్నాళ్లు మూసుకుంటే మరో రెండేళ్లు పూర్తవుతాయి. ఆ తర్వాత జమిలి ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కేరింతలు కొట్టారు. కార్యకర్తలు, నాయకులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా.. ఏ అవసరమైనా ఎంపీ అవినాశ్ రెడ్డిని కలవాలని వైఎస్ జగన్ సూచించారు. 'అవినాశ్ బిర్యానీ పెట్టకపోయినా.. పలావ్ తినిపిస్తాడు' అని వ్యాఖ్యానించడంతో నవ్వులు విరబూశాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

Trending News