Venkata Net Worth:భారత బ్యాట్మింటన్ ఐకాన్ పీవీ సింధు ఎట్టకేలకు వివాహ బంధం లోకి అడుగుపెట్టింది.. ఈ నేపథ్యంలోనే ఈమె అలాగే ఈమె భర్తకు సంబంధించిన ఆస్తుల వివరాలు వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఈమె భర్త ఎవరు? ఆయన ఎందులో ఫేమస్ అనే విషయం కూడా తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత బ్యాట్మింటన్ ఐకాన్ పీవీ సింధు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒలంపిక్ విజయాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇకపోతే ఎట్టకేలకు పీవీ సింధు మిస్ కాస్త మిస్సెస్ అయిపోయింది. ఈరోజు ఉదయపూర్ లో ఘనంగా వెంకట దత్త సాయి ను వివాహం చేసుకొని ఏడు అడుగులు వేసింది.
ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ వివాహానికి విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా ఈ జంటకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే పీవీ సింధు నికర ఆస్తి విలువ అలాగే వెంకట దత్త సాయి ఆస్తుల విలువ కూడా సంచలనంగా మారింది.
మరి ఈ ఇద్దరు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు మరి వీరి ఆస్తులు విలువ ఎంతో ఇప్పుడు చూద్దాం.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పీవీ సింధు ఆస్తుల విలువ రూ.59 కోట్లు. ముఖ్యంగా బ్యాట్మింటన్ లో విజయాలు సాధించిన తర్వాత పలు ఎండార్స్మెంట్ ఉత్పత్తుల ద్వారా భారీగా సంపాదించింది. అంతేకాదు ఇండియాలో అత్యధిక ఆదాయం పొందుతున్న మహిళ అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది సింధు..
ముఖ్యంగా హైదరాబాదులో హిల్ టాప్ హోమ్ ఈమె సొంతం. ఈ భవనం చూస్తే ఈమె లగ్జరీ జీవితానికి అర్థం పడుతుంది. ముఖ్యంగా పీవీ సింధు రియల్ ఎస్టేట్లో కూడా భారీగా పెట్టబడులు పెట్టింది. ఈమె దగ్గర ఉన్న కార్ కలెక్షన్ విషయానికొస్తే.. హీరో అక్కినేని నాగార్జున ఈమెకు బీఎండబ్ల్యూ x5 కారును బహుమతిగా ఇచ్చారు. దీంతోపాటు ఆనంద్ మహేంద్ర నుండి మహేంద్ర థార్ కార్లు ఈమె కారు గ్యారేజీ లో ఉన్నాయి..
ముఖ్యంగా ఈమె బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏషియన్ పెయింట్స్, పోర్ట్ ఫోలియోలో మేబెల్ లైన్ వంటి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. పీవీ సింధు భర్త వెంకట దత్త సాయి విషయానికి వస్తే.. ఈయన పోసిడెక్స్ టెక్నాలజీస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు బ్యాంకింగ్ రంగంలో ఆయన వినూత్న పరిష్కారాలు ఆయనను సుసంపన్నుడిగా మార్చాయి. సుమారుగా ఆయనకు రూ.150 కోట్లకు పైగా ప్రాపర్టీ ఉన్నట్లు సమాచారం.