Allu Arjun Police Station : పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య టాకీస్ లో జరిగిన ఘటనతో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ ను ఈ కేసులో ఏ11గా చేర్చారు. ఈ విషయమై బన్ని.. అరెస్ట్ చేయడం.. బెయిల్ మంజూరు కావడం.. ఒక రాత్రి జైల్లో గడపడం వంటివి చక చకా కీలక పరిణామాలు జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్.. తన తండ్రి అల్లు అరవింద్ తో పాటు మామతో పాటు తన లాయర్లతో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం వెళ్లారు. తాజాగా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే అల్లు అర్జున్ క్యారెక్టర్ ను అసాసినేట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో ప్రభుత్వంపై నెగిటివిటీ ఏర్పడింది. దీంతో రేవంత్ రెడ్డి తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు ఎవరు.. బహిరంగంగా అల్లు అర్జున్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదనే ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్ధేశాం చేయాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం ఆదేశించారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి.. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎలాంటి ప్రత్యేక షోలు, టికెట్ల రేట్ల పెంపు ఇకపై ఉండవని కుండ బద్దలు కొట్టారు.
ఈ ఇష్యూ తర్వాత ఈ విషయమై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు తనపై అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు అల్లు అర్జున్ పై మాటల దాడికి దిగారు. పార్టీలోని ముఖ్యమైన నేతలంతా బన్నీపై దుమ్మెత్తి పోశారు. ఈ విషయం జాతీయ మీడియాకు కూడ చేరడంతో.. రేవంత్ రెడ్డి అప్రమత్తమై.. ఇకపై నేతలెవరూ అల్లు అర్జున్ ఎపిసోడ్ పై స్పందించ కూడదని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు బన్నిని పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ప్రశ్నలు కురిపించనున్నారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.