Varadhi: ఘనంగా వారధి మూవీ ఫ్రీరిలీజ్ ఫంక్షన్.. విడుదల ఎప్పుడంటే..?

Varadhi Pre Release Event : యూత్‌ఫుల్ థ్రిల్లర్ వారధి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా, రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మించిన ఈ ఈ సినిమాకి.. శ్రీ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి విడుదలకు ముందు హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగింది.  పూర్తి వివరాల్లోకి వెళ్ళితే..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 23, 2024, 05:11 PM IST
Varadhi: ఘనంగా వారధి మూవీ ఫ్రీరిలీజ్ ఫంక్షన్.. విడుదల ఎప్పుడంటే..?

Varadhi Pre Release Event : తాజాగా రూపొందిన యూత్‌ఫుల్ థ్రిల్లర్..వారధి ఈ నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా, రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకు ముందు.. హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగింది.  

ప్రధాన అతిథిగా పాల్గొన్న ఎర్రచీర మూవీ డైరెక్టర్ సుమన్ మాట్లాడుతూ, "వారధి యూత్‌కి రొమాన్స్ థ్రిల్లర్‌గా ప్రత్యేక అనుభూతి కలిగించగల చిత్రం. డైరెక్టర్ కృషి చూస్తే ఇది మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం" అని అన్నారు.  
  
దర్శకుడు శ్రీకృష్ణ మాట్లాడుతూ, "ఇది ఒక ఎమోషనల్ డ్రామా. భార్యాభర్తల మధ్య సున్నితమైన భావోద్వేగాలను ప్రదర్శించే ప్రయత్నం చేశాం. కొత్త నటీనటులతో చేసిన ఈ చిత్రం అందరికీ కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రతి పాత్ర కూడా మనసుకు హత్తుకునేలా తీర్చిదిద్దాం. ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్ మేళవింపుతో చిత్రాన్ని తెరకెక్కించాం" అన్నారు.  

హీరో అనిల్ అర్కా మాట్లాడుతూ, "ఈ సినిమా ద్వారా నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు కృతజ్ఞతలు. కుటుంబ బంధాలను హృదయాన్ని హత్తుకునే విధంగా చిత్రీకరించాం. ప్రేక్షకుల ఆదరణ కోసం ఎదురుచూస్తున్నాం" అని అన్నారు.  
హీరోయిన్ విహారికా చౌదరి మాట్లాడుతూ, "దర్శకుడు ప్రతి ఒక్కరి నుంచి అత్యుత్తమ ప్రతిభను తీసుకున్నారు. యూనిట్ సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్‌ను సంతోషంగా పూర్తి చేశాం" అని అన్నారు.  

'వారధి' ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను కలిపి వినూత్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. సినిమా ఎల్లప్పుడూ కొత్త అనుభవాలకోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.  

'వారధి' 2024 డిసెంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని.. చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేశారు.

Also Read: YS Jagan Sharmila: బర్త్ డేకు విష్ చేయని షర్మిల! వైఎస్‌ జగనన్న అంటే అంత కోపమా?

Also Read: YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్‌ షర్మిల ప్రశ్నలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

Trending News