Public Holiday: దేశవ్యాప్తంగా బ్యాంకులకు క్రిస్మస్ సెలవులున్నాయి. మరో పదిరోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. కానీ 8 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వీటిలో క్రిస్మస్ సెలవులున్నాయి. ఇవి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 5 రోజులు సెలవులున్నాయి. అయితే డిసెంబర్ 25 బుధవారం మాత్రం స్కూళ్లు, కళాశాలలు, బ్యాంకులకు సెలవులున్నాయి.
క్రిస్మస్ సెలవులు వచ్చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు క్రిస్మస్ సెలవులు 5 రోజులున్నాయి. ఈ నెలలో మొత్తం 10 రోజులు సెలవులుంటే అందులో క్రిస్మస్ సెలవులు కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవు డిసెంబర్ 25 బుధవారం ఒక్కరోజే ఉంటే కొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజులుంటాయి.
డిసెంబర్ 24 క్రిస్మస్ సందర్భంగా కోహిమా, ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 25 దేశవ్యాప్తంగా క్రిస్మస్ సెలవు
డిసెంబర్ 26 కొన్ని రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవు
డిసెంబర్ 27 క్రిస్మస్ సెలవు
డిసెంబర్ 28 నాలుగవ శనివారం సెలవు
డిసెంబర్ 29 ఆదివారం సెలవు
గోవా సహా ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవులు ఎక్కువ రోజులుంటాయి. ఇక షిల్లాంగ్‌లో డిసెంబర్ 30న ప్రాంతీయ సెలవుంది. డిసెంబర్ 31న కొత్త ఏడాది వేడుకల సెలవుంది. ఇక డిసెంబర్ 25 బుధవారం నాడు క్రిస్మస్ పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు, స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు సెలవుంది.
Also read: Train Tickets Subsidy: సీనియర్ సిటిజన్లకు శుభవార్త, రైల్వే టికెట్లపై సబ్సిడీ ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.