Harvard Study: నెలలో 21 సార్లు శృంగారంలో పాల్గొంటే.. ఆ ప్రాణాంతక వ్యాధికి చెక్..!

Prostate Cancer Risk: ప్రొస్టేట్ క్యాన్సర్.. ప్రస్తుతం పురుషులను భయపెడుతున్న పెద్ద సమస్య. ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ప్రమాదం నుంచి భయపడేందుకు పరిశోధనల నిర్వహించిన హార్వర్డ్ శాస్త్రవేత్తలు.. తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఈ విషయాన్ని పురుషులందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ప్రొస్టేట్ క్యాన్సర్‌కు హార్వర్డ్ శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /10

శృంగారం ప్రతి మనిషి జీవితంలో ఓ భాగం. జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొంటే ఇద్దరి మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందనేది అందరికీ తెలిసిందే. అయితే అనేక వ్యాధుల ప్రమాదం నుంచి కూడా శృంగారంతో బయటపడొచ్చు.  

2 /10

ప్రొస్టేట్ క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మంది పురుషులు మరణిస్తున్నట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గణాంకాల వెల్లడిస్తన్నాయి. ఈ సంఖ్య మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  

3 /10

ఈ నేపథ్యంలోనే పరిశోధనల నిర్వహించిన హార్వర్డ్ శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. పురుషులు తమ భాగస్వాములతో ఒక నెలలో 21 లేదా అంతకంటే ఎక్కువసార్లు సంభోగంలో పాల్గొంటే.. ఈ ప్రాణాంతకమైన ప్రొస్టేట్ క్యాన్సర్‌ ప్రమాదం నుంచి తప్పించుకోచ్చని వెల్లడించారు.  

4 /10

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని దాదాపు 31 శాతం తగ్గించవచ్చని తమ పరిశోధనలో వెల్లడైందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం తెలిపింది.  

5 /10

పురుషుల తమ లైంగిక వాంఛను తీర్చుకునేందుకు ఇతర పద్ధతులను అవలంబించినా ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.  

6 /10

పురుషుల జీవనశైలి, ఆరోగ్యం, ఆహారం ఆధారంగా డేటా రూపొందించిన హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. పురుషులు తమ లైంగిక సంతృప్తిని పొందితే ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోచ్చని వెల్లడించారు.  

7 /10

ప్రొస్టేట్ అనేది లైంగిక సంతృప్తి కోసం ద్రవాన్ని ఉత్పత్తి  చేసే పునరుత్పత్తి అవయవం. ఈ ద్రవాలను విడుదల చేయడం ప్రయోజనకరమని చెబుతున్నారు.    

8 /10

1986 నుంచి పెద్ద సంఖ్యలో ఆరోగ్య కార్యకర్తల నుంచి డేటాను సేకరించారు. 46 నుంచి 81 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 29342 మంది పురుషులు తమ లైంగిక కార్యకలాపాల గురించి చెప్పారు.  

9 /10

తమ భాగస్వామి లేదా తామంతట తాము ఎంత తరచుగా లైంగిక చెందారు..? పునరుత్పత్తి అవయవాల నుంచి ఎన్నిసార్లు ద్రవం విడుదల అవుతుంది..? వంటి విషయాలను తెలుసుకున్నారు.  

10 /10

పురుషులు క్రమం తప్పకుండా స్కలనం చేస్తే..  ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడింట ఒక వంతు తక్కువగా ఉంటుందని హార్వర్డ్ శాస్త్రవేత్తలు తేల్చారు.