APSRTC Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ నిరుద్యోగ యువతకు అద్భుతమైన శుభవార్తను తీసుకువచ్చింది. త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీ లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
APSRTC Recruitment 2025 Check Here Full Details: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది.. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్న ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. వీలైనంత తొందరలోనే APSRTC సంస్థలో ఉన్న 18 విభాగాలకు సంబంధించిన ఖాళీ ఉద్యోగాలకు భర్తీ చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు దాదాపు 7,545 వేల ఉద్యోగాలు కాళీ ఉన్నట్లు తెలిపింది. అయితే వీటి భర్తీకే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హులకు ఉండాల్సిన నియమాలను కూడా వెల్లడించింది. అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు పదవ తరగతి పరీక్షలో తప్పకుండా ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. అలాగే బీటెక్ చదివిన విద్యార్థులకు కూడా తదితర అనుబంధ విభాగాల్లో రిక్రూట్ చేసుకోబోతున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మొత్తం ఏడు వేలకు పైగా ఖాళీలు ఉండగా.. వాటిని పూర్తిగా భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా తీసుకోబోతున్నట్లు తెలిపింది. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాన్ని అప్లై చేసుకునేందుకు అవకాశం కలిపించింది.
అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే కొన్ని కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులకు వయస్సు సడలింపును నోటిఫికేషన్ లో జోడించారు. ఎస్సీ ఎస్టీ కేటగిరి ఉన్నవారికి ఐదు సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ భర్తీలో భాగంగా ముందుగా రాత పరీక్ష పెట్టి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న పోస్టుల వారిగా చూస్తే.. ఇందులో మొత్తంగా డ్రైవర్ కు సంబంధించిన ఉద్యోగాలే మూడు వేలకు పైగా ఉన్నాయి. ఇక కండక్టర్ ఉద్యోగాలు 1800కు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ మెకానిక్ ఉద్యోగాలు 500 కు పైగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇలా వివిధ భాగాల్లో భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ పోస్టుల భర్తీకి అప్లై చేసుకునే వారు నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారిక https://www .apsrtc .ap .gov .in/ వెబ్సైట్ లో నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వెబ్సైట్ని సందర్శించి ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన రకాల విషయాలను కూడా తెలుసుకోవచ్చు.