Henna Hair Pack Homemade: నల్ల జుట్టు కోసం చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నల్ల జుట్టు కోసం ఖరీదైనా ప్రొడెక్ట్స్‌లను ఉపయోగిస్తారు. వీటి వల్ల జుట్టు నిర్జీవంగా మారుతుంది. అయితే మీరు సహాజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలని ఆలోచిస్తున్నారా? ఈ సహజమైన హెన్నాను ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. కేవలం పది నిమిషాల్లో దీని తలకు రాసుకుంటే సరిపోతుంది.
పెరుగు, కాఫీ పొడితో హెన్నా ను తయారు చేసుకోవడం ఎలా?
మన ఇంట్లోనే సొంతంగా హెన్నాను తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు కేవలం పెరుగు, కాఫీ పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. పెరుగు, కాఫీ జుట్టుకు ఎలా సహాయపడుతుంది? పెరుగు, కాఫీ రెండూ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి కలిసి జుట్టుకు అనేక రకాలుగా ప్రయోజనాలు చేకూర్చుతాయి.
పెరుగు, కాఫీ జుట్టుకు ఇలా సహాయపడతాయి:
కాఫీలోని కాఫెయిన్ రక్త ప్రసరణను పెంచుతుంది ఇది జుట్టు మూలాలకు రక్తాన్ని అందిస్తుంది. పెరుగులోని ప్రోటీన్లు జుట్టును దృఢంగా ఉండేలా చేస్తుంది. కాఫీ స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది, ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. పెరుగు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. రెండూ కలిసి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ జుట్టును మృదువుగా చేస్తుంది. కాఫీ జుట్టుకు కాంతిని ఇస్తుంది. పెరుగు జుట్టును లోతుగా కండిషన్ చేస్తుంది.
పెరుగు, కాఫీ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి:
కావలసినవి:
1 కప్పు పెరుగు
2-3 టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్
కొద్దిగా నిమ్మరసం
తయారీ విధానం:
ఒక గిన్నెలో పెరుగు, కాఫీ పౌడర్, నిమ్మరసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్‌ను మీ తలకు మరియు జుట్టుకు అప్లై చేయండి. 30-40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. గోరువెచ్చని నీటితో కడిగి, మీరు సాధారణంగా ఉపయోగించే షాంపూతో తల స్నానం చేయండి.
ముఖ్యమైన విషయాలు:
ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించవచ్చు.
మీరు ఎలాంటి అలర్జీలు లేకుంటేనే ఈ మాస్క్‌ను ఉపయోగించండి.
ఈ మాస్క్‌ను ఉపయోగించే ముందు మీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
గమనిక: ఈ సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా సమస్య ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి