WTC Final Qualification: డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్.. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?

WTC Points Table: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నుంచి తృటిలో ఓటమి నుంచి తప్పుకున్న భారత్.. డ్రాతో గట్టెక్కింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1 సమంగా మారింది. మూడో డ్రాగా ముగియడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ అవకాశాలపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ సైకిల్‌లో టీమిండియాకు ఆసీస్‌తో చివరి రెండు టెస్టుల మాత్రమే ఉన్నాయి. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చుద్దాం..
 

1 /8

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 55.88 శాతంతో మూడోస్థానంలో ఉంది. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా (63.33%) ఉండగా.. ఆస్ట్రేలియా (58.88%) రెండోస్థానంలో ఉంది.  

2 /8

మూడో టెస్ట్‌లో ఓటమి నుంచి జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ గట్టెక్కించారు. వీరిద్దరు ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఫాలో ఆన్ గండం తప్పించారు.  

3 /8

రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే లక్ష్యంతో ఆసీస్ 89 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేయగా.. భారీ వర్షం కురవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.  

4 /8

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరుకోవాలంటే.. మెల్‌బోర్న్, సిడ్నీలలో జరిగే చివరి రెండు టెస్టుల్లో కనీసం ఒక్కటైనా గెలవాలి. మరో మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకోవాలి.   

5 /8

శ్రీలంకను ఓడించిన దక్షిణాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. పాకిస్థాన్‌తో జరగబోయే సిరీస్‌ను గెలిస్తే.. ఫైనల్ బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకుంటుంది.  

6 /8

శ్రీలంకతో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను 2-0తో గెలిస్తే.. ఫైనల్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా ఓడిపోతే.. టీమిండియా అవకాశాలు మెరుగవుతాయి.  

7 /8

ఆసీస్‌ భారత్ చివరి రెండు టెస్టుల గెలిస్తే.. 60.52 శాతంతో ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమవుతుంది. ఒకటి గెలిచి.. మరోకటి డ్రా చేసుకుంటే.. 57.01 శాతానికి చేరుకుంటుంది. ఆస్ట్రేలియా-శ్రీలంక సిరీస్‌పై ఆధారపడి ఉంటుంది.  

8 /8

మెల్‌బోర్న్‌లో జరగనున్న బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీలో జరిగే ఆఖటి టెస్టు భారత్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. మూడో టెస్ట్ ఆఖర్లో పుంజుకోవడంతో భారత్ ఆత్మవిశ్వాసంతో రెడీ అవుతోంది.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x