Royal Enfield Scram 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో జబర్దస్‌ బైక్.. డిజైన్‌ చూడడానికి రెండు కళ్లు చాలవు!

Royal Enfield Scram 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మార్కెట్‌లో కొత్త స్క్రామ్ 440 మోటర్‌ సైకిల్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కావడమే కాకుండా ప్రత్యేకమైన లుక్‌లో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 23, 2024, 04:35 PM IST
Royal Enfield Scram 440: రాయల్ ఎన్‌ఫీల్డ్  నుంచి మరో జబర్దస్‌ బైక్.. డిజైన్‌ చూడడానికి రెండు కళ్లు చాలవు!

Royal Enfield Scram 440: ప్రముఖ మోటర్‌సైకిల్‌ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అద్భుతమైన బైక్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ప్రతి ఏడాది ప్రీమియం మోటర్‌ సైకిల్స్‌ విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని Scram 440 పేరుతో లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని రాయల్ ఎన్ఫీల్డ్ అద్భుతమైన పవర్‌తో పాటు టార్క్‌తో తీసుకు రాబోతోంది. అయితే కంపెనీ ఈ మోటర్‌ సైకిల్‌ని 2025 సంవత్సరంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దీని ధరను కూడా అప్పుడే ప్రకటించే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే ఇటీవలే ఈ బైక్‌కి సంబంధించి కొన్ని ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త స్క్రామ్ 440 మోటర్‌ సైకిల్‌ అద్భుతమైన డిజైన్‌తో లాంచ్‌ కాబోతంది. అంతేకాకుండా ఇది ప్రీమియం టెక్నాలజీతో రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మోటర్‌ సైకిల్‌ థీమ్‌ పరంగా చాలా కొత్త లుక్‌లో కనిపించబోతోంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో విడుదల కానుంది. అయితే ఈ మోటర్‌ సైకిల్‌ను కంపెనీ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో గత బైక్‌ల కంటే అద్భుతమైన ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉండబోతున్నాయి.

ఇంజన్ పవర్‌తో పాటు టార్క్:
ఈ  స్క్రామ్ 411 లుక్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే..గతంలో విడుదలై హిమలయన్‌ డిజైన్‌ను పోలి ఉంటుంది. ఇక ఈ బైక్‌  443సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ సెటప్‌తో లాంచ్‌ కానుంది. అలాగే ఇది పరిమాణంలో 81mm వెడల్పు కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మోటర్‌ సైకిల్‌ ఇంజన్‌  4.5% ఎక్కువ పవర్ ఉత్పత్తి చేయడమే కాకుండా 8.5% ఎక్కువ టార్క్ ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే స్క్రామ్ 411 బైక్‌ గరిష్టంగా 34 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు ఈ బైక్‌ ఇంజన్‌  6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. 

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

ఇక Scrum 440 మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన కొత్త ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఎంతో శక్తివంతమైన LED హెడ్‌లైట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో బల్బ్ ఇండికేటర్లు లభించనున్నాయి. అంతేకాకుండా కంపెనీ ఈ మోటర్‌ సైకిల్‌లో మొబైల్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కోసం USB టైప్ A ఛార్జర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ట్రిప్డ్ పాడ్ నావిగేషన్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. 

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News