8Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్.. 8వ పే కమిషన్‌ ప్రకటన ఎప్పుడంటే..?

8Th Pay Commission Latest News: ప్రతి పది సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు సంబంధించి డీఆర్, ఇతర ప్రయోజనాలను పే కమిషన్ సమీక్షించి కేంద్రానికి సిఫార్సులు పంపిస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగులకు ప్రయోజనాలు చేకురేవిధంగా నిర్ణయం తీసుకుంటుంది.

1 /5

8th pay commission ఏర్పాటు చేయాలని చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పే కమిషన్ అమలైతే జీతాలు ఒకేసారి భారీ మొత్తంలో పెరుగుతాయి.

2 /5

వచ్చే ఏడాది మార్చి నెలలో కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ ప్రకటన సందర్భంగా 8th pay commission ఏర్పాటు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

3 /5

ప్రస్తుతం 7th pay commission అమలు అవుతుండగా.. ఉద్యోగుల బేసిక్ రూ.18 వేలు ఉంది. కొత్త పే కమిషన్ అమల్లోకి వస్తే.. కనీస వేతనం రూ.34,500 అవుతుందని అంచనా వేస్తున్నారు. 

4 /5

దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెరిగింది. దీంతో మొత్తం 53 శాతానికి చేరింది. పెరిగిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి అమలు చేశారు

5 /5

వచ్చే ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో డీఏ పెంపు ఉండనుంది. ALL INDIA CONSUMER PRICE INDEX (AICPI) డేటా ఆధారంగా జీతాల పెంపు ఉంటుంది.