Coconut Oil in Beauty Routine: కొబ్బరి నూనె మాయిశ్చర్ ఇచ్చే గుణాలు ఉంటాయి ఈ సీజన్లో అప్లై చేయడం వల్ల పొడిబారిన చర్మానికి చెక్ పెడుతుంది అయితే ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో ముఖంపై సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చని మీకు తెలుసా? కొబ్బరి నూనెతో ముఖంపై మచ్చలు గీతలు లేకుండా చేయవచ్చు. దీంతో మీ ముఖం పట్టులా మెరుస్తూ కనిపిస్తుంది. ఒక్క మచ్చ కూడా కనిపించదు యవ్వనంగా ఉంటారు
కొబ్బరి నూనెను మన డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో అప్లై చేయడం వల్ల ముఖం యవ్వనంగా ఆరోగ్యంగా కనిపిస్తారు. కొబ్బరి నున్న మన అందరి ఇండ్లలో సులభంగా అందుబాటులో ఉంటుంది. దీంట్లో యాంటీ ఇన్‌న్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఏవైనా గాయాలు అయినప్పుడు, జుట్టుకు, ముఖానికి కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెను ముఖానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
కొబ్బరినూనెను నిమ్మరసం వేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై మచ్చలు గీతలు తొలగిపోతాయి. ఎందుకంటే కొబ్బరి నూనెలో ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి రక్షించే గుణాలు ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందులో వాడే నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మీ ముఖ రంగును మెరుగు చేస్తుంది.
మీ ముఖం హైడ్రేషన్ అందుతుంది. ఒక చెంచా పచ్చి పాలలో రెండు చుక్కల నిమ్మరసం వేసుకొని కొబ్బరి నూనె కూడా వేసుకొని ముఖానికి సర్క్యూలర్ మోషన్లో అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని ఓ 3 నిమిషాల పాటు మర్దన చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మెత్తగా మెరుగ్గా కనిపిస్తుంది.
ఇదీ చదవండి: Gardening Tips: మొక్కల పెరుగుదల కుంటుపడిందా? ఒక్క అరటిపండు తొక్కతో ఆరోగ్యంగా పెరుగుతుంది..
ముఖంపై ఉండే మచ్చలు గీతాలు తొలగిపోయి ముఖం కాంతివంతం అవుతుంది. దీనికి ముందుగా ముఖంపై పింక్ సాల్ట్, కొబ్బరి నూనెతో స్క్రబ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ అప్లై చేయాలి. దీంతో రెట్టింపు ఫలితాలు పొందుతారు. అంతేకాదు కొబ్బరి నూనెను కాఫీ పొడి వేసుకొని ముఖానికి స్క్రబ్ చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ముఖంపై స్క్రబ్ వాడటానికి కొబ్బరి నూనెలో కాఫీ పొడి, సన్నని చక్కెర పొడి వేసుకొని స్క్రబ్ చేసుకోవాలి. దీంతో కూడా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది, పార్లర్ కి వెళ్లకుండానే ముఖం రెట్టింపు రంగు మీ సొంతం అవుతుంది.
ఇదీ చదవండి: SkinCare: స్కిన్ కేర్ రొటీన్‌లో సీతాఫలం.. రెట్టింపు నిగారించే అందం మీ సొంతం..
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొబ్బరి నూనెతో ఇలా మీరు మెరుగైన ఛాయను పొందవచ్చు. కొబ్బరి నూనెను ఇలా తరచూ ముఖంపై ఉపయోగించటం వల్ల వృద్ధాప్య సమస్యలు త్వరగా కనిపించవు. ముఖంపై చారలు మచ్చలు గీతలు తొలగిపోతాయి. దీంతో మీరు ఏ ఖర్చు లేకుండానే ఇంట్లోనే పార్లర్ వంటి గ్లో పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Coconut Oil: ఒక చుక్క కొబ్బరి నూనెతో ముఖంపై ఒక మచ్చ.. గీత కూడా కనిపించదు..