How To Get Rid Of Cold Symptoms: చలికాలంలో జలుబు, దగ్గు సాధారణ సమస్యలు. జలుబు, దగ్గులకు ప్రధాన కారణం వైరస్‌లు. చలికాలంలో వీటి వ్యాప్తి త్వరగా జరుగుతుంది. చలికాలంలో మన శరీరంలోని ప్రతిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో వైరస్‌లను ఎదుర్కోవడం కష్టమవుతుంది. చలికాలంలో చాలా మంది వ్యక్తిగత శానిటైజేషన్‌పై తక్కువ శ్రద్ధ చూపుతారు. దీని వల్ల వైరస్‌లు త్వరగా వ్యాపిస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందడానికి త్వరగా కోలుకోవడానికి ఇక్కడ కొన్ని సహజమైన పద్ధతులు జాగ్రత్తలు ఉన్నాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం చాలా మంది మెడిసిన్స్‌లను ఉపయోగిస్తారు. కానీ ఇంట్లోనే ప్రతిరోజు ఉపయోగించే కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల సమస్య నుంచి పూర్తి ఉపశమనం కలుగుతుంది.
తులసి, నల్లమిరియాలు: దగ్గు, జలుబు ఉన్నవారు తులసి, నల్లమిరియాలు తీసుకోవడం చాలా మంచిది. ఇందులో యాంటీబయాటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి హానికరమైన వైరస్‌లను తొలగించడం సహాయపడుతాయి. ముందుగా ఒక గ్లాస్‌లో గోరువెచ్చని నీటి తీసుకొని రెండు తులసి ఆకులు, మూడు స్పూన్‌ల నల్లమిరియాల పొడి కలుపుకోవాలి. దీని రాత్రి పడుకొనే ముందు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
అల్లం, తేనె: తీవ్రమైన జలుబు, దగ్గుకు అల్లం, తేనె ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండిటిలో యాంటీబయాటిక్, యాంటీవైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్షెక్షన్‌లతో పోరాడడానికి ఎంతో సహాయపడుతాయి. దీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గ్లాస్‌లో వేడి నీళ్లు తీసుకోవాలి ఇందులోకి అల్లం రసం, తేనె కలుపుకోవాలి దీని పడుకొనే ముందు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
పసుపు పాలు: పసుపు పాలు అనేది ఎంతో సులభమైన ఔషధం. ఇది దగ్గు, జలుబు వాటికి ఎంతో ప్రభావింతంగా పని చేస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఒక గ్లాస్ పాలు తీసుకొని కొంచెం పసుపు కలుపుకొని తాగడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
వేడి నీటి ఆవిరి: వేడినీటి ఆవిరితో జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ తగ్గించుకోవచ్చు. ఇది సులభమైన పద్ధతి. దీని కోసం పెద్ద గిన్నెలో నీరు పోసి వేడి చేయాలి. ఆ తరువాత గిన్నెను పక్కకు పెట్టాలి. ఇప్పుడు తలను టవల్‌తో కప్పి ఆవిరి పీలుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్క దిబ్బడ తగ్గుతుంది. దగ్గు, గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.
ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల దగ్గు , జలుబు , గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
Also Read: Diabetes Health Tips: ఆరోగ్యానికి అండగా నిలిచే చిరుధాన్యాలు.. డయాబెటిస్ రోగులకు ఎలా సహాయపడుతాయి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Natural Remedies For A Cold: ఇంట్లోనే ఇలా చేస్తే జలుబు, దగ్గు మటుమాయం..!