Cinnamon Tea Benefits: రోజు ఉదయం ఉదయం అందరూ దీని తప్పకుండా తాగుతూ ఉంటారు. ఎందుకంటే టీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా అనేక రకాలుగా ప్రయోజనాలను చేకూర్చుతుంది. అందుకే చాలామంది ఉదయాన్నే నిద్ర లేవగానే టీ ని తాగుతూ ఉంటారు. అయితే చాలామంది పాలు చక్కెరతో కలిగిన టీని ఎక్కువగా తాగేందుకు ఇష్టపడతారు. నిజానికి ఇలా తాగడం అంత మంచిది కాదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలలో ఉండే కొన్ని గుణాలు, చక్కెర రక్తంలోని షుగర్ లెవెల్స్ ను పెంచి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని వారు అంటున్నారు. నిజానికి ఈ టీకి బదులుగా దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ ని తీసుకోవడం ఎంతో మంచిదని వారంటున్నారు. ఈ టీలో ఉండే ఆయుర్వేద గుణాలు, సిన్నమోల్డిహైడ్ అనే పదార్థం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెడుతుంది. అయితే ఈ టీ తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
దాల్చిన చెక్క టీ తాగడం వల్ల కలిగే లాభాలు:
రక్తంలో చక్కెర పరిమాణాలకు చెక్:
చాలామందిలో పాలతో టీ తాగితే రక్తంలోని చక్కర పరిమాణాలు ఒక్కసారిగా పెరుగుతూ ఉంటాయి. దీని ప్రభావం ఇన్సులిన్ పై కూడా చూపుతుంది. అయితే దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ ని రోజు తాగడం వల్ల ఇన్సులిన్ మెరుగుపడడమే కాకుండా రక్తంలోని చక్కర పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండె సమస్యలకు చెక్:
దాల్చిన చెక్క టీ తాగితే అన్ని రకాల గుండె సమస్యలు దూరమవుతాయి. ఈ నీటిని తాగడం వల్ల చెడు కొవ్వు కరిగిపోవడమే కాకుండా.. మంచి పోవు విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా బాడీలోని కండరాలు మెరుగుపడడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులన్నీ దూరమవుతాయి. అలాగే గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలకు చెక్:
జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం చాలామందిలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా జీర్ణ క్రియ తీవ్రంగా దెబ్బతింటుంది. దీంతో మలబద్ధకంతో పాటు ఇతర పొట్ట సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి కూడా దాల్చిన చెక్క టీ ప్రభావంతంగా సహాయపడుతుంది.
వ్యాధులకు క్రిమిసంహారంగా..:
చాలామందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సీజనల్ వ్యాధులు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి దాల్చిన చెక్క టీని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టీలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అనేకరకాల అడారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే శరీరానికి అద్భుతమైన శక్తిని కూడా అందిస్తాయి.
రోగ నిరోధక శక్తి పెంచేందుకు..:
దాల్చిన చెక్కలో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూడా సహాయపడతాయి. దీని కారణంగా సులభంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో జలుబు, దగ్గు వంటి అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీర్యం ఉత్పత్తికి:
దాల్చిన చెక్క టీ శుక్ర కణాల ఉత్పత్తికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. సంతానలేని సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట కప్పు చొప్పున ఈ దాల్చిన చెక్క టీని తాగితే శుక్ర గణాల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా వాటి నాణ్యత కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Cinnamon Tea: రోజు ఒక కప్పు దాల్చిన చెక్క టీ తాగితే ఏమవుతుందో తెలుసా? ఇవి తెలిస్తే షాక్ అవుతారు..