Kalyana Kanuka Scheme: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకనుంచి వారి అకౌంట్లోకి రూ.9 వేలు..

Kalyana Kanuka Scheme: రిటైర్ అయిన ఆర్మీ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉచితంగా రూ.50 వేలు అందించబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుందో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. 

Kalyana Kanuka Scheme:  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిజాయితీని నిలబెట్టుకునేందుకు అనేక విధాలుగా కృషి చేస్తూ వస్తోంది. ఎన్నికలవేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ వాటిని అమలు చేసే దిశగా వెళ్తోంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద.. అర్హుదారులు రూ. 50 వేలు ఉచితంగా పొందడమే.. కాకుండా ప్రతినెల రూ.9 వేల వరకు అందిస్తోంది. ఇంతకీ  ఈ పథకం ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. 

1 /6

ఇండియన్ ఆర్మీ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.. ఇందులో ప్రతి సంవత్సరం లక్షలాదిమంది చేరి దేశానికి సేవ చేస్తూ ఉంటారు. గతంలో కంటే ఇప్పుడు యుద్ధాలు పెద్దగా లేకపోయినా విపత్తు, ఇతర ప్రాజెక్టుల్లో భాగంగా ఇండియన్ ఆర్మీ తన వంతు కృషి చేస్తోంది. ముఖ్యంగా కాశ్మీర్ చొరబాట్లలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అయితే వీరి కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  

2 /6

సైన్యంలో పనిచేసే ప్రతి మాజీ సైనిక్ అధికారుల కూతుర్ల పెళ్లిలకు తెలంగాణ సర్కార్ రూ.50 వేలు కానుకగా అందించబోతోంది. గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ కేవలం రూ.40 వేలు మాత్రమే కానుకగా ఇచ్చేది అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందులోకి రూ.10 వేల రూపాయలు కలిపి కళ్యాణ కానుకగా రూ.50 వేలు అందిస్తోంది.  

3 /6

అలాగే రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్మీలో పనిచేసిన సైన్యాధికారులకు సంబంధించిన రిటైర్మెంట్ పెన్షన్, పథకాలకు సంబంధించిన డబ్బులను కూడా పెంచినట్లు తెలుస్తోంది. దీని ద్వారా పెన్షన్ గతంలో కంటే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది.  

4 /6

ఇక ఆర్మీ నుంచి వచ్చి రిటైర్డ్ అయిన వారు చనిపోతే గతంలో ప్రభుత్వం కేవలం రూ.10 వేల మాత్రమే అందించేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులోకి రూ.10 వేలు పెంచి.. రూ.20 వేలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అయితే దీనిపై ప్రకటనను కూడా అధికారికంగా రేవంత్ సర్కార్ విడుదల చేసింది.   

5 /6

అలాగే చిన్న వయసులో సైనికాధికారులు అమరులైతే.. వారి తల్లిదండ్రులకు రూ.2.5 లక్షల వరకు సహాయం చేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు మరణించిన సైనికాధికారుల భార్యకు కూడా దాదాపు రూ.3 లక్షలు ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా రేవంత్ సర్కార్ ముందు ముందు వీరికి మరిన్ని ప్రయోజనాలను తెచ్చిపెట్టే పథకాలను కూడా అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.   

6 /6

అలాగే రిటైర్డ్ అయిన ఆర్మీ అధికారులకు దాదాపు 15 ఏళ్లలోపే పిల్లలు ఉంటే.. ఇకనుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ నేరుగా వారి అకౌంట్లోకి రూ.9 వేల జమ చెయ్యబోతున్నట్లు తెలిపింది. అలాగే అవయవాల మార్పిడికి కూడా దాదాపు రూ.2 లక్షలకు పైగా అందించబోతున్నట్లు తెలిపింది.