Owaisi Vs KTR: మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఎంఐఎం పార్టీ.. ఆ పార్టీ అధికారంలోంచి దిగగానే.. తన నిజ స్వరూపం బయటపెట్టుకుంది. అంతేకాదు మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన ఒవైసీ సోదరులు.. ఏ ఎండకు ఆ గొడుకు పట్టిన చందంగా ఇపుడు కాంగ్రెస్ పార్టీతో దోస్తానా చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి కటీఫ్ చెప్పేసింది. అంతేకాదు బీఆర్ఎస్ గద్దె దిగినప్పటి నుంచి ఆ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శల బాణం ఎక్కుపెడుతున్నాడు.
ముఖ్యంగా బీఆర్ఎస్ నేత జాతకాలన్ని తమ దగ్గరున్నాయని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు. అవి బయటపెడితే.. కేటీఆర్ సహా ఎవరు తట్టుకోలేరు అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ 24 మంది క్యాండిడేట్స్ ను మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందన్నారు.
కానీ కేసీఆర్ ఒంటెద్దు పోకడల వల్లే ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించినా.. స్థానికంగా ఉండే నేతలపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ పుట్టి ముంచిందన్నారు. మొత్తంగా తండ్రీ కొడుకుల అహంకారం వల్లే ఓడిపోయారంటూ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేసారు. మొత్తంగా మొన్నటి వరకు దోస్తానా చేసిన పార్టీనే ఒవైసీ ఎండగట్టారు. మరోవైపు నగరంలో నిర్మించిన తన అక్రమ కట్టడాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలగొట్టకుండా.. ఉండేందుకే ఆ పార్టీకి చేరువ అయినట్టు తెలుస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి తనకు నచ్చని తమకు సపోర్ట్ చేయని వాళ్లనే టార్గెట్ చేస్తూ బుల్డోజర్లు నడిపిస్తుందనే టాక్ ఉంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter