Unstoppable with NBK latest promo: దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా లక్కీ భాస్కర్. దీపావళి సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 31వ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రీమియర్స్ రేపు అనగా అక్టోబర్ 31 తేదీన.. దాదాపు 1000 స్క్రీన్స్ లో వేస్తున్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో యమ ఆక్టివ్ గా పాల్గొంటున్నారు సినిమా యూనిట్. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ సైతం తెలుగు మీడియాకి ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఇప్పటికే మహానటి, సీతారామం లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఈ హీరో ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో సినిమా చేసి విడుదల చేస్తుండగా.. ఈ చిత్రం కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా.. లక్కీ భాస్కర్ సినిమా యూనిట్ బాలకృష్ణ అండ్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కి వచ్చారు.
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో దీపావళి సందర్భంగా ఈరోజు విడుదల చేశారు. ఈ ప్రోమో ఆధ్యాంతం.. సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పటిలానే బాలకృష్ణ యమ ఆక్టివ్ గా.. దుల్కర్ సల్మాన్‌తో తెగ జోకులు వేస్తూ కనిపించారు. దుర్కర్ సల్మాన్ తో చాలాసేపు మాట్లాడిన తరువాత దర్శకుడు వెంకి అట్లూరి సైతం వచ్చారు. ఆయనతో కూడా ఎన్నో పంచులు వేశారు బాలయ్య.
కాగా నిర్మాత నాగ వంశీ వచ్చిన తరువాత ఈ ప్రోమో మరింత ఇంట్రెస్టింగా మారింది. హీరోలలో కొంతమంది రెమ్యూనరేషన్‌తో విసిగిస్తున్నారని.. బాలకృష్ణ, నాగవంశీ ఇన్ డైరెక్ట్ పంచులు వేసుకోగా.. నాగవంశీ ఆయనకు దిల్ రాజు పింక్ ప్యాంట్ వేసుకోవడం ఇష్టం లేదు అంటూ చెప్పారు. ఇక ఆ తర్వాత ఈ ప్రోమోలో మీనాక్షి చౌదరి కూడా కనిపించింది. వెంకీ అట్లూరి తనకు పూజ హెగ్డే అంతే ఇష్టం అనగా.. ‘నీ హైట్ ఎక్కడ పూజ హైట్ ఎక్కడ.. ఐ లవ్ యు మీనాక్షి’ అంటూ బాలకృష్ణ తెగ సందడి చేశారు.
మొత్తానికి సరదా సరదాగా సాగిన ఈ ప్రోమో చూస్తే ఈవారం విడుదల కాబోయే ఈ ఎపిసోడ్ పైన ప్రేక్షకులకు.. మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
Also read: Mercury Transit 2024: బుధ గోచారం ప్రభావం నవంబర్ 1 నుంచి ఈ 3 రాశులకు అంతా డబ్బే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.