Gold Price : పసిడిని పట్టుకోవడం కష్టమే..భారీగా పెరిగిన బంగారం ధర..వెండి ధర ఎంతంటే?

Gold Price Today: బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఎందుకంటే వీటి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఒకరోజు తగ్గితే..మరో రోజు పెరుగుతుంది. ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేస్తూ..వార్తల్లో నిలుస్తుంటాయి. ఇక పండగల సీజన్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులు బంగారం ధర అందనంత ఎత్తుకు చేరుకుంది. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం ధర రూ. 20వేలు పెరిగింది. ఇక దీపావళి పండగ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 
 

1 /7

Gold Price Today:బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పెళ్లిళ్ల సమయంలో వీటికి ఇంకా ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు దీపావళితోపాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల్లో మార్పులు వస్తున్నాయి. ఆదివారంతో పోల్చితే నేడు బంగారం ధరలో స్వల్ప మార్పు కనిపించింది. ఆదివారం 22 క్యారెట్ల బంగారం ధర పదిగ్రాములకు రూ. 73,600గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 80,290గా ఉంది. అయితే వెండి ధర కిలోకు రూ. 98,000ఉంది.   

2 /7

నేడు సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 73,610గా ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 80, 300గా ఉంది. వెండి కిలో ధర 98,100 వద్ద కొనసాగుతోంది.   

3 /7

అయితే ఈ ధర పెరుగుదల అనేది యూరప్ , అమెరికా మార్కెట్లో ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ అస్థిరత, పశ్చిమాసియాలో నెలకున్న యుద్దం వంటి ప్రపంచ మార్కెట్ల అనిశ్చిత పరిస్థితులు ఇన్వెస్టర్లను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లిస్తాయి. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులు నెలకున్నప్పుడు బంగారం, వెండిని సురక్షితమైన పెట్టుబడిగా పెట్టుబడిదారులు పరిగణిస్తుంటారు.   

4 /7

వీటన్నింటికి తోడుగా భారత్ లో పండగ సీజన్, పెళ్లిళ్ల సీజన్  కావడంతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పండగల సీజన్ నేపథ్యంలో బంగారం, వెండికి పెద్ద మొత్తంలో డిమాండ్ పెరుగుతుంది.

5 /7

సరఫరా పరిమితం అయితే ఇది ధరలపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ధరలు బంగారం, వెండి ధరలను కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరగగానే ప్రజలు గోల్డ్ పై ఇన్వెస్ చేయడాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తుంటారు. 

6 /7

ఇక సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు కూడా ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కబర్చుతుంటారు.   

7 /7

అయితే పండగ సమయంలో మార్కెట్ గతంలో గోల్డ్ ఇన్వెస్ట్ చేసినవారికి ఒక సువర్ణావకాశంగా మారుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ఆభరనాల కొనుగోలు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని అంటున్నారు.