Dana Cyclone: తీరం దాటిన దానా తుపాన్.. విద్యా సంస్థలకు సెలవు..


Dana Cyclone: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీరం దాటింది. ఇది ఒడిషాలోని బిత్తర్ కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య మిడ్ నైడ్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉదయం వరకు ఇది కొనసాగి తుపాన్‌ బలహీనపడనుంది.

1 /6

Dana Cyclone:దాన తుపాన్ ‌ తీరం దాటే సమయంలో గంటలకు 120 కిలో మీటర్ల  వేగంతో తీవ్రంగా గాలులు వీచాయి. ఒడిశా తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.

2 /6

 దానా పాన్‌ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో పలు విద్యా సంస్థలకు ఆయా ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. 

3 /6

కోల్‌కతా, భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్ట్‌ను దానా తుపాను కారంగా  మూసి వేసారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం పలు మార్గాల్లో 400పైగా  రైళ్లను రద్దు చేశారు. అధికారులు తుపాను ప్రభావితమయ్యే ప్రాంతాలను నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాదు సహాయ పునరావాస కేంద్రాల్లో వసతులు కల్పించారు. 

4 /6

అటు ఆంధ్ర ప్రదేశ్ లోని  ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్రలోని ఓడరేవులకు మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

5 /6

ఈ సందర్భంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళ వద్దని హెచ్చరించారు. దానా తుపాను తీరం దాటినా  ప్రజలు అలర్ట్‌గా వుండాలని తుపాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేసింది.

6 /6

అంతేకాదు వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అంతేకాదు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవారు జాగ్రత్తగా తమ ఇంట్లో విలువైన వస్తువులను ఒకవేళ ఇంట్లో పై అంతస్తు ఉంటే అక్కడికి తరలిస్తే బెటర్ అని అధికారులు తెలియజేసారు. దానా తుపాను తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.