Kolkata Doctor case: కోల్ కత్తా డాక్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు నిజంగా ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే?

Kolkata Doctor case cbi report: కోల్ కతా లేడీ డాక్టర్ ఎంత దారుణంగా అత్యాచారానికి బలి అయ్యిందో మనందరికీ తెలిసిందే.  ముఖ్యంగా ప్రాణం పోయాల్సిన డాక్టర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెను హతమార్చారు.. ముఖ్యంగా ఆమెపై చేసిన ఈ అత్యాచారం ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఇప్పుడు ఈ కేసు పై తాజాగా విడుదలైన సిబిఐ రిపోర్ట్ మరింత ఆశ్చర్యపరుస్తోంది..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Oct 9, 2024, 09:11 AM IST
Kolkata Doctor case: కోల్ కత్తా డాక్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు నిజంగా ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే?

Kolkata Doctor case update : కోల్ కతా లేడీ డాక్టర్ కేసు జరిగిన దగ్గర నుంచి.. ఆడవారికి పని ప్రదేశాలలో కూడా స్వతంత్రం లేదు అంటూ చాలామంది..ఈ విషయంపై నినాదాలు కూడా చేశారు. నిందితులను అరెస్టు చేస్తున్నామంటూ రోజుకు ఒకరి పేరు బయటకు తీస్తున్నారు.. కానీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని బాధిత యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

నిజానికి కోల్కతా లేడీ డాక్టర్ కేసులో అసలు ఆరోజు ఏం జరిగింది..?  అనే విషయం తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో విస్తు పోయే నిజం ఒకటి బయటకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోల్కతా లేడీ డాక్టర్ అత్యాచారానికి గురైనప్పుడు  అసలు ఆ రోజు ఏం జరిగింది..? అక్కడ ఎవరెవరున్నారు ..? సామూహిక హత్యాచారం నిజమేనా..?అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. 

లేడీ డాక్టర్ హత్యాచార ఘటన అనూహ్య మలుపు తీసుకుంది. లేడీ డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదని సిబిఐ క్లారిటీ ఇచ్చింది. అయితే లేడీ డాక్టర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించినప్పుడు.. లేడీ డాక్టర్ కడుపులో  150 ml సెమెన్ గుర్తించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఒక వ్యక్తి నుంచి కేవలం 11 ml సెమెన్ మాత్రమే ఏకకాలంలో వస్తుందని, దీంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది అంటూ పెద్ద  ఎత్తున నిరసనలు వినిపించాయి. 

అయితే తాజాగా ఆమెపై సామూహిక అత్యాచారం జరగలేదని సిబిఐ వెల్లడించింది. డాక్టర్ హత్యాచార ఘటనపై ప్రత్యేక న్యాయస్థానంలో సిబిఐ చార్జి షీట్ దాఖలు చేసింది. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే లేడీ డాక్టర్ ను అత్యాచారం చేసి , చంపేశాడని చార్జ్ షీట్ లో తెలిపారు. 200 మంది సాక్షులను విచారించి బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదని సిబిఐ స్పష్టం చేసింది. 

సెమినార్ హాల్లో లేడీ డాక్టర్ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడినట్టు,  అత్యాచారం చేసి చంపేసినట్టు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు అని సిబిఐ చార్జ్ షీట్ లో తెలిపింది. మరి దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News