హైదరాబాద్: తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన లభిస్తోంది. తెలంగాణలో 2,216 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించగా ఇప్పటివరకు 37 వేల దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.700 కోట్ల మేర ఆదాయం లభించినట్టు సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి.
ఇదిలావుంటే, ఈ నెల 18న లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. తెలంగాణలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ఏపీకి చెందిన పలువురు మద్యం వ్యాపారులు కూడా పోటీపడినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న వారి బంధువులు, స్నేహితుల ద్వారా టెండర్లు దాఖలుచేసినట్టు వార్తలొస్తున్నాయి.
దరఖాస్తులతోనే రూ.700 కోట్లు ఆదాయం