Budha Shukra Yuthi: బుధ, శుక్ర గ్రహా సంచారం.. ఈ 4 రాశుల వారికీ వద్దన్న డబ్బే..

Budha Shukra Yuthi: అక్టోబర్ రెండో వారంలో గ్రహ మండలంలో అత్యంత అనుకూల గ్రహాలుగా పేరు పడ్డ బుధుడు, శుక్రుడు తామున్న రాశి నుంచి వేరొక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో చెడుపై మంచి సాధించిన విజయ దశమి కూడా ఇపుడే వస్తుంది. గ్రహాల కలయికలో మార్పు.. అమ్మవారి అనుగ్రహం కారణంగా ఈ నాలుగు రాశుల వారికీ ఎలా ఉండబోతుందో మీరు ఓ లుక్కేయండి..

1 /6

మేష రాశి... మేష రాశి వారికి సానుకూల ఫలితులుంటాయి. వ్యాపారులకు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇదే అనువైన సమయం. చదువుకున్న యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభించే ఛాన్సెస్ ఉన్నాయి.  మీలో  మనోధైర్యాన్ని పెంచే అవకాశాలున్నాయి.  పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు ఇది మంచి సమయం.  మంచి కుటుంబ సంబంధాలు ఏర్పడే అవకాశాలున్నాయి. భార్య భర్తల మధ్య సంబంధాలు బాగుంటాయి.  గత  కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు దూరమవుతాయి.

2 /6

మిథున రాశి.. మిథున రాశి వారికీ ఇది మంచి యోగ కాలం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు చేసే పనిలో ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేముందు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జీవిత భాగస్వామితో మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఉద్యోగం ఎదురుచూస్తోన్న విద్యార్ధులకు సానుకూల ఫలితాలుంటాయి.  కొన్ని అనుకోని చికాకులు వెంటాడుతాయి. మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

3 /6

సింహ రాశి.. ఈ వారం సింహ రాశి వారికి అనుకోని అదృష్టాన్ని తీసుకు రాబోతుంది. ఉద్యోగ, ఉపాధి పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. వృథా ఖర్చులకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన మరమ్మత్తులకు సంబంధించిన ఖర్చు పెరుగుతుంది. పెళ్లి కానీ స్త్రీ, పురుషులకు ఈ సమయంలో మంచి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. సూర్య నమస్కారాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. ఇది మీకు శారీరక, మానసిక బలాన్ని సమకూరుస్తుంది.

4 /6

కుంభ రాశి.. ఈ రాశి వారి జీవితంలో పురోగతి కనిపిస్తుంది.  కెరీర్‌లో సానుకూల మార్పులు ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులు పదోన్నతి లేదా జీతం పెరుగుదల ప్రయోజనాలను పొందే అవకాశాలున్నాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు.  సామాజిక జీవితంలో మీ కీర్తి అమాంతం  పెరుగుతుంది.  కొత్త వ్యక్తులతో పరిచయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మానసిక ఒత్తిడిని జయించండి.

5 /6

మీన రాశి.. మీన రాశి వారికి ఆర్ధిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ కృషికి తగిని ప్రతిఫలం అందుకుంటారు. కుటుంబ సంబధాలు మెరుగు పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.  మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి.  యోగా, ధ్యానంతో సానుకూల ఫలితాలను అందుకుంటారు.

6 /6

గమనిక : ఇక్కడ మేము ఇచ్చిన కంటెంట్.. ఇంటర్నెట్, పండితులు చెప్పిన చెప్పిన దాన్నేమేము ప్రస్తావించాము.  ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.