Mega Family: మెగా ఇంట మొదలైన మెగా సంబరాలు.. మరొక మెగా వారసుడు రాబోతున్నాడా?

Varun Tej - Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట ఇప్పుడు తమ మొదటి బిడ్డకు ఆహ్వానం.. పలకడానికి రెడీగా అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా ఇంట మరొక వారసుడు వచ్చే టైం అయ్యింది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
 

1 /5

మెగా హీరో వరుణ్ తేజ్.. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల జంట కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పుకోవచ్చు. చూడముచ్చటగా ఉండే ఈ జంట గత ఏడాది ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరి గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

2 /5

2017లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ అనే సినిమా షూటింగ్ సెట్స్ మీద మొదటిసారిగా.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలుసుకున్నారు. వీరి మధ్య స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. కానీ చాలా కాలం ఈ జంట తమ ప్రేమ వ్యవహారాన్ని చాలా సీక్రెట్ గానే ఉంచారు.   

3 /5

గత ఏడాది జూన్ లో జరిగిన వీరి నిశ్చితార్థం తర్వాతే.. వీరి ప్రేమ గురించి క్లారిటీ వచ్చింది. అదే ఏడాది నవంబర్లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్య వీరి పెళ్లి జరిగింది. కానీ ఇండియా తిరిగి వచ్చాక.. టాలీవుడ్ సెలబ్రిటీలు అందరినీ పిలిచి రిసెప్షన్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

4 /5

తాజాగా ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా లావణ్య త్రిపాఠి గర్భవతి అని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. తాజాగా వెకేషన్ లో ఉన్న ఈ జంట ఫోటోలలో కూడా.. లావణ్య త్రిపాఠిను చూసి ఆమె కచ్చితంగా గర్భవతి అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

5 /5

ఈ నేపథ్యంలో త్వరలో మెగా ఇంటా మరొక వారసుడు లేదా వారసురాలు.. రాబోతుంది అని మెగా ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియా ద్వారా ఈ జంట కి శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. మరోవైపు పెళ్లి తర్వాత సినిమాలకి కొంచెం దూరంగా ఉంటోంది లావణ్య త్రిపాఠి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమా త్వరలో విడుదలకి సిద్ధం అవుతోంది.