Have lost our patience: రేషన్ కార్డుల కోసం ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వసల కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాల తీరు ఆందోళనకరంగా ఉందని..ఈ విషయంలో తమకు ఇక ఓపిక నశించిందని సుప్రీంకోర్టు పేర్కొంది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రేషన్‌కార్డుల జాప్యంపై వలస కూలీలకు రేషన్‌కార్డులు అందించడంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి నవంబర్ 19 వరకు కేంద్రం, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు (యుటి) చివరి ఛాన్స్ ఇచ్చినట్లు పేర్కొంది. న్యాయమూర్తి మాట్లాడుతూ.. మాకు ఓపిక నశించింది. సహనం కోల్పోయాము. ఇదే చివరి ఛాన్స్ అంటూ సీరియస్ అయ్యారు. "మా ఆర్డర్‌ను పాటించడానికి మీకు చివరి అవకాశం ఇస్తున్నాము లేదా మీ కార్యదర్శి హాజరవుతారు" అంటూ ఆయా రాష్ట్రాల సీఎస్ లకు చివాట్లు పెట్టింది.
Also Read: Israel Hezbollah War: హిజ్బుల్లాకు మరో చావుదెబ్బ...నస్రల్లా వారసుడు హషీమ్ సఫీద్దీన్ హతం
కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణలోనికి తీసుకుని..సుప్రీంకోర్టు 2020లో దీనిపై సుమోటోగా విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటాతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులను రేషన్ కార్డులు జారీ చేయాలని 2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేశాయి. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి.ఈ విషయంలో మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆయాపై రాష్ట్రాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: Swiggy Bolt: బిర్యానీ ప్రేమికులకు గుడ్ న్యూస్..10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి