Rajendra Prasad Daughter: రాజేంద్రప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులక.. ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల.. నుంచి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి నటుడి ఇంట్లో ఈరోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గాయత్రి.. హార్ట్ ఎటాక్ రావేడం వల్ల.. మరణించారు. ఈ క్రమంలో రాజేందర్ ప్రసాద్ పాత వీడియో ఒకటి తెగ వైరల్ అవుతూ అందరిని కదిలిస్తోంది..
రాజేంద్ర ప్రసాద్ అంటే తెలుగు సినీ ప్రేక్షకుల మధ్యలో ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఈ నటుడు ఇంట్లో.. ఈరోజు విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి.. 38 సంవత్సరాలకే మరణించారు.
గాయత్రి కి శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్ అరెస్ట్ రావడంతో .. వెంటనే హైద్రాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. శనివారం ఉదయాన్నే మరణించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ ఇంటికి ఎంతోమంది సెలబ్రెటీస్ చేరుకొని.. గాయత్రికి నివాళులు అర్పిస్తున్నారు.
ఈ క్రమంలో గతంలో రాజేంద్రప్రసాద్..తన కూతురి గురించి.. ఒక సినిమా ఈవెంట్ లో చెప్పిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. అందరినీ కంత తడి పెట్టిస్తున్నాయి.
రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి వృత్తి రీత్యా డాక్టర్. అయితే గాయత్రి తన తండ్రి మాట వినకుండా.. ప్రేమ వివాహం చేసుకుంది. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన కూతురు తననీ కాదనీ, వేరే అబ్బాయి ప్రేమ పెళ్లి చేసుకున్న కారణంగా రాజేంద్రప్రసాద్ తో.. గాయత్రీ కి కాస్త విభేదాలు చోటు చేసుకున్నాయి.
అందుకే చాలా సంవత్సరాల పాటు రాజేంద్రప్రసాద్ తన కూతురితో మాట్లాడలేదు. అయితే.. ఈ మధ్యనే కూతురికి.. ఆమె భర్తకు దగ్గరయ్యారు రాజేంద్రప్రసాద్. అంతేకాకుండా తాను నటించిన మహానటి సినిమాలో.. సావిత్రి చిన్నప్పటి పాత్రలో.. తన మనవరాలు అనగా.. గాయత్రి కూతురిని.. నటించేలా చేశారు.
ఇదే విషయాన్ని ఈవెంట్లో చాలా ఎమోషనల్ గా చెప్పారు. బేవర్స్ అనే సినిమాలో కూతురు లేకపోతే తండ్రి ఎలా అయిపోయారు అనేదానిపైన ఒక ఎమోషనల్ పాట వస్తుంది. ఆ పాత గురించి చెబుతూ..ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురితో తాను చాలా రోజులు మాట్లాడ లేదని, అయినా ఈ పాట విన్న తరువాత కూతురిని పిలిపించి మరి.. నా మనసులోని మాట ఈ పాటను ప్లే చేసి చూపించాను అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.
ప్రస్తుతం కూతురి మరణంతో కుమిలిపోయి, కుప్పకూలిన రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తూ.. చాలామంది అప్పట్లో ఆయన చెప్పిన మాటల గురించి తలుచుకుంటూ మరింత బాధపడుతున్నారు.