Today Gold Rate: బంగారం ధర ఆకాశమే సరిహద్దుగా చెలరేగిపోతోంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తులం బంగారం ధర తొలిసారిగా 78 వేల రూపాయలు దాటిపోయింది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా నిలబడిన పరిస్థితుల కారణంగా చెబుతున్నారు.
Today Gold and silver Rate: నేడు అక్టోబర్ 2 బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,150 వద్ద నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,150 వద్ద నమోదు అయ్యింది. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణంగా చెప్పవచ్చు.
ఇరాన్ ఇజ్రాయిల్ పై దాడి చేసిన నేపథ్యంలో పశ్చిమాసియాలో అశాంతి నెలకొని ఉంది. ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితుల వల్ల ప్రపంచ వాణిజ్యం కుంటు పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఆయిల్ ఉత్పత్తి పైన ఇది ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ కారణంగా సప్లై చేయి దెబ్బతిని, వాణిజ్యం నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగా స్టాక్ మార్కెట్లో సైతం నెగిటివ్ గా స్పందించే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లలోద ఎప్పుడు పతనం నమోదు అవుతుందని ఊహించినా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయి. బంగారం ధరలు పెరగడానికి ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
బంగారం ధరలు ఇప్పటికే చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాదికాలంగా గమనించినట్లయితే బంగారం ధర ఏకంగా 16 వేల రూపాయలు పెరిగింది. ఇక్కడ నుంచి బంగారం ధర ఏ రేంజ్ కు వెళ్ళవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు దేశీయంగా గమనించినట్లయితే దసరా నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ నెల చివరి నాటికి దీపావళి ధన త్రయోదశి ఉన్నాయి.
కాగా ఈనెల పెద్ద ఎత్తున ప్రజలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. దీంతో మన దేశంలో కూడా డిమాండ్ పెరిగి బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. బంగారం ధరలు దీపావళి నాటికి కనీసం 85 వేల నుంచి 90 వేల మధ్యలో పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగినట్లయితే బంగారం ధర సరికొత్త రికార్డులను తాకుతుంది.
అయితే బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిదీ ఆభరణాలు కొనుగోలు చేసేవారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నాణ్యత తూకం పైన ఎక్కువగా దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితులను హాల్ మార్క్ బంగారం మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.