Raja Yogam: అక్టోబర్ లో 4 అరుదైన రాజయోగాలు.. ఈ 3 రాశుల వారికీ లాటరీ తగిలినట్టే..


Raja Yogam: జ్యోతిష్య శాస్త్ర  ప్రకారం, అక్టోబర్ నెలలో శని దేవుడు, రవి, బృహస్పతి, కుజుడు, బుధుడు, శుక్ర గ్రహాల గమనంలో మార్పు వలన పలు రాశుల వారి జీవితంలో పెద్ద మార్పులు సంభవిస్తాయి.

1 /7

బృహస్పతి ఈ సమయంలో వక్ర గమనంలో ప్రయాణిస్తూ  ఉంటాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు తామున్న రాశుల నుంచి వేరే రాశిలోకి ప్రవేశిస్తాయి. ఈ గ్రహాల సంచారం వల్ల అక్టోబర్ నెలలో 4 రాజయోగాలు ఏర్పడుతున్నాయి.

2 /7

శని కుంభరాశిలో వక్రంలో ప్రయాణించడం వలన షష రాజయోగాన్ని సృష్టిస్తోంది. దీని వలన ధన, వ్యాపార, బుద్ధి ప్రదాత అయిన బుధుడు భద్ర రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. శుక్రుడు మాళవ్య రాజ్యయోగాన్ని, లక్ష్మీ నారాయణ రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. ఏకకాలంలో ఇన్ని రాజయోగాలు ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారీ జీవితంలో మార్పులు సంభవించనున్నాయి.

3 /7

జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం, అక్టోబర్ నెలలో ఏర్పడే ఈ రాజయోగాలు 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతన్నాయి. అంతేకాదు బంపర్ ప్రయోజనాలతో పాటు  ఆనందాన్ని ఇవ్వనున్నాయి.  

4 /7

వృషభ రాశి: వృషభరాశి వారికి అక్టోబర్ నెల చాలా లక్కీ అని చెప్పాలి.  ఈ వ్యక్తులు కెరీర్ తో పాటు  వ్యాపారంలో ఊహించిన దాని కంటే అతిపెద్ద విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలగనుంది. అంతేకాదు  ఈ రాశుల వారికీ ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి  ఆదాయాన్ని పొందుతారు. చేసే వృత్తిలో వృద్ధి ఉంటుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. డబ్బు సంపాదించడంతో పాటు  ఆదా చేయడం రెండింటిలోనూ విజయం సాధిస్తారు.

5 /7

సింహ రాశి : సింహ రాశి వారికి ఈ నెల కూడా చాలా లాభదాయకంగా  ఉండబోతుంది. రాజయోగంతో  అదృష్టం వరించబోతుంది.   కొత్త ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి.  మీ కెరీర్‌లో అద్భుతమైన అవకాశాలను అందుకుంటారు. పాత సమస్యలు తొలగిపోతాయి. అనుకున్న  లక్ష్యాలను అందుకుంటారు ఆదాయ వనరులు పెరుగుతాయి.

6 /7

తులా రాశి: తులా రాశి వారికి అక్టోబర్ నెల బంపర్ ప్రయోజనాలను కలిగించనుంది. తులా రాశిలోనే మాళవ్య రాజ్యయోగం వలన అనుకోని ధనలాభం కలగనుంది. కొన్ని గొప్ప వార్తలను వింటారు. మీ వివాహా జీవితం స్థిమితంగా ఉంటుంది. జీవితంలో ఆనందం, సంపద,  పెరుగుతాయి. కొత్త ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి. కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఇంట్లో  పునర్నిర్మాణ పనులు చేపడతారు.

7 /7

గమనిక : ఇక్కడ మేము తెలియజేసిన సమాచారం ఇంటర్నెట్ లభించిన సమాచారం ఆధారంగా అందించాము. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.