Tata Curve vs Citroen Basalt: ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్ కూపే స్టైల్ SUV లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇవి రెండు చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ వేరువేరు ఫీచర్లను కలిగి ఉంటాయి. అయితే ఈ రెండింటిలలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకోండి.
Tata Curve vs Citroen Basalt: మార్కెట్లోకి అద్భుతమైన కార్లు లాంచ్ అవుతున్నాయి. ప్రీమియం ఫీచర్స్ తోనే అతి తక్కువ ధరల్లో చైనా, కొరియన్, జపాన్ దేశాలకు సంబంధించిన కార్లు భారత్ లో అతి తక్కువ ధరలతో లాంచ్ అవడంతో చాలామంది దృష్టి వాటిపైకి మరలుతోంది. ముఖ్యంగా ఒకప్పుడు కూపే స్టైల్ SUV లు మార్కెట్లోకి చాలా అరుదుగా లాంచ్ అయ్యేవి. అయితే వీటికి ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ లో విడుదల చేస్తున్నాయి.
ఇటీవలే మార్కెట్లోకి టాటా మోటార్స్, సిట్రోయెన్ కూడా అద్భుతమైన కొత్త కూపే స్టైల్ SUV లను విడుదల చేశాయి. ఈ రెండు కంపెనీలు Curvv తో పాటు సిట్రోయెన్ బసాల్ట్ పేర్లతో అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే చాలామంది ఈ రెండు కార్లలోని ఫీచర్లను కంపేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఏ కారు కొనాలో తెలియక తికమక పడుతున్నారు. నిజానికి ఈ రెండు కార్లకు సంబంధించిన ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెండు కూపే SUV లు దాదాపు సేమ్ ఫీచర్స్ కలిగి ఉన్న గాడి కొన్ని స్పెసిఫికేషన్లో తేడాలు ఉన్నాయి. ఇవి రెండు ఎంతో శక్తివంతమైన ఫీచర్స్ తో పాటు ప్రత్యేకమైన ఎయిర్ బ్యాగ్స్ తో అందుబాటులోకి వచ్చాయి. ఇందులోని టాటా కర్వ్ విషయానికొస్తే ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న కాంపాక్ట్ SUVలతో ఊహించని స్థాయిలో పోటీ పడుతోంది.
ఇక సిట్రోయెన్ బసాల్ట్ సబ్-4 మీటర్ల SUV సెగ్మెంట్ లో మార్కెట్లో తనదైన శైలి ముద్ర వేసుకుంది. అయితే సిట్రోయెన్ కంపెనీ ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన అన్ని వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు రూ. 7 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ రూ. 13.83 లక్షల ధరతో ఉంది. ఇక టాటా కర్వ్ విషయానికొస్తే ఇది రూ. 9 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక దీని టాప్ ఎండ్ ధర రూ.19 లక్షలు గా టాటా కంపెనీ ప్రకటించింది.
ఇక ఈ రెండు కార్లకు సంబంధించిన పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే ..టాటా కర్వ్ ఎంతో శక్తివంతమైన 1.2 లీటర్ త్రి సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా త్రీ సిలిండర్ టర్బో జి డి ఐ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ లో కూడా లభిస్తోంది. ఇదిలా ఉంటే ఇక సిట్రోయెన్ బసాల్ట్ వివరాల్లోకి వెళితే.. ఈ కారు కూడా 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్ ఆప్షన్తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ డీజిల్ వేరియంట్ లో ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు.
ఇక ఈ రెండు కార్లకు సంబంధించిన భద్రత ఫీచర్ల వివరాల్లోకి వెళితే.. టాటా కర్వ్ ఎంతో బ్రైట్నెస్ తో కూడిన LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు కలిగి ఉంటుంది. దీంతోపాటు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ కూడా లభిస్తుంది. అలాగే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తోపాటు అద్భుతమైన సీటింగ్ ఫెసిలిటీని కూడా అందిస్తుంది.
ఈ టాటా కర్వ్ కారు క్రాస్ టెస్ట్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ ను కూడా పొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సిట్రోయెన్ బసాల్ట్ కారుతో చూస్తే ఈ కారు అద్భుతమైన సెక్యూరిటీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.