Black Water Benefits: సాధారణంగా చాలామంది సెలబ్రిటీస్ నార్మల్ వాటర్ కంటే బ్లాక్ వాటర్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
బ్లాక్ వాటర్ ఈ పేరు వినగానే ఆశ్చర్యం కలిగవచ్చు. కానీ ఈ వాటర్‌ను సినీ తారలు, క్రీడా ప్రముఖులు ఎగబడి తాగుతుంటారు. బ్లాక్ వాటర్ అనేది సాధారణ నీటి కంటే ఎంతో భిన్నమైనది. ఇది చూడడానికి చాలా నలుపుగా ఉంటుంది. దీని ఎలా తాగుతారు బాబోయ్ అనిపిస్తుంది.
అయితే బ్లాక్ వాటర్ ఎందుకు నల్లగా ఉంటుంది? దీనికి కారణం ఇందులో ఉండే కొన్ని ఖనిజాలు నీటిని నల్లగా మార్చుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి నీటితో కలిసి ఆక్సైడ్‌లుగా మారి, నీటికి నల్లటి రంగును ఇలా మార్చుతాయి.
కొన్ని అధ్యయనాల ప్రకారం, బ్లాక్ వాటర్ తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
సాధారణంగా నార్మల్ వాటర్ PH లెవెల్స్ ఏడు ఉంటుంది. కానీ బ్లాక్ వాటర్‌లో దీని కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ ను తాగడం వల్ల శరీరం ఫిట్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో మేలు చేస్తాయి.
గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం, ప్రేగు సమస్యలు వంటి వాటిని కూడా తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బ్లాక్ వాటర్ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
అలాగే బ్లాక్ వాటర్ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.అంతేకాకుండా బ్లాక్ వాటర్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడం పనిచేస్తుంది. దీని వల్ల మానసిక స్థితికి మెరుగుపడుతుంది.
నార్మల్ వాటర్‌లో అకర్బన్ లవణాలు ఉంటాయి. కానీ బ్లాక్ వాటర్‌లో అధిక శాతం ఆల్కలీన్ ఉంటుంది. దీని వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటా
అందుకే చాలా మంది ఈ వాటర్‌ను ఉపయోగిస్తుంటారు. బ్లాక్ వాటర్ కొంచెం ఖరీదైనప్పటికి లాభాలు మాత్రం బోలెడు ఉంటాయి. అయితే మీరు ఏదైనా ట్రై చేసే ముందు నిపుణులు సలహా తీసుకోవడం చాలా మంచిది.