Shukraditya Raja Yogam: వచ్చే యేడాది కన్యా రాశిలో గ్రహాల రాజు అయిన రవి, విలాస కారకుడైన శుక్రుడు కలవడం శుభ పరిణామంగా పరిగణిస్తారు. రవి, శుక్రలు కన్య రాశిలో కలిసి ఏర్పరిచే యోగాన్ని శుక్రాదిత్య రాజయోగంగా అభివర్ణిస్తారు. ఈ యోగంతో ఈ మూడు రాశుల జీవితంలో మంచి జరగబోతడంతో పాటు వద్దన్న డబ్బు చేతికి అందుతుంది.
Shukraditya Raja Yogam: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికతో కొన్ని యోగాలు ఏర్పడతాయి. అలాంటి యోగాల్లో శుక్రుడు, రవి కలయిక వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మరో యేడాది తర్వాత కన్యరాశిలో ఏర్పడబోతుంది.
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికీ శుక్రాదిత్య రాజయోగం వల్ల కుటుంబంలో గత కొన్నేళ్లుగా నెలకున్న విభేదాలు తొలిగిపోతాయి. చేస్తున్న వృత్తిలో వృద్ధి ఉంటుంది. అనుకోని డబ్బు చేతికి అందుతుంది.
వృశ్చిక రాశి.. శుక్రాదిత్య రాజయోగం వల్ల వృశ్చిక రాశి అనుభవిస్తున్న కష్టాలు పటాపంచలవుతాయి. చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. శుభ ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా వృత్తి జీవితంలో విశేష లాభాలను ఆర్జిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది.
మకర రాశి.. మకర రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం వల్ల చేసే వృత్తిలో విజయం వరిస్తుంది. వ్యాపారంల కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఆర్ధిక పరిస్థితులు కుదుటపడుతాయి. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అందుతుంది.
గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అభిప్రాయాలు మరియు విలువలను కలిగి ఉంది. ZEE NEWS దీన్ని ధృవీకరించదు.