7 Ghee Benefits: ప్రతి ఒక్కరికీ అధిక బరువు నుంచి విముక్తి పొందాలని ఉంటుంది. అందరూ బరువు తగ్గించేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. నెయ్యితో బరువు పెరుగుతారని చాలామంది భావిస్తారు. కానీ ఇది పొరపాటు. నిజానికి నెయ్యితో బరువు తగ్గించుకోవచ్చు. నెయ్యితో కలిగే 7 అద్భుత లాభాలు తెలుసుకుందాం.
రోజుకు ఎంత నెయ్యి తీసుకోవాలి నెయ్యిలో కేలరీలు , ఫ్యాట్ ఎక్కువ . అందుకే రోజూ తగినంత మోతాదులోనే నెయ్యి తినాలి. రోజూ 1-2 చెంచాలకు మించి తినకూడదు
హార్మోన్ బ్యాలెన్స్ నెయ్యిలో ఉండే హెల్తీ ఫ్యాట్ అనేది హార్మోన్ ఉత్పత్తిలో కీలక భూమిక వహిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ బ్యాలెన్స్‌కు ఉపయోగపడుతుంది
గుండె ఆరోగ్యం నెయ్యిలో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా లాభదాయకం. నెయ్యిలో ఉండే శాచ్యురేటెడ్ ఫ్యాట్ చాలా మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది
బరువు తగ్గించేందుకు నెయ్యితో బరువు పెరుగుతారనేది కేవలం ఆపోహ. వాస్తవానికి నెయ్యి క్రమ పద్ధతిలో తీసుకుంటే బరువు తగ్గించవచ్చు. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఇందుకు ఉపయోగపడతాయి,.
స్కిన్ కేర్ నెయ్యిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దాంతో చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. చర్మం దురద వంటి లక్షణాలు పోతాయి.
ఇమ్యూనిటీ పెంచడం నెయ్యిలో ఉండే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ ఇ కారణంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడం, ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడటం జరుగుతుంది
కడుపు ఆరోగ్యం నెయ్యిలో షార్ట్ చెన్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది కడుపు ఆరోగ్యానికి చాలా అవసరం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట వంటి లక్షణాలు తగ్గిస్తుంది
మెదడు వికాసం నెయ్యిలో ఉండే హెల్తీ ఫ్యాట్ ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు సక్రమంగా పనిచేసేందుకు దోహదపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
నెయ్యితో లాభాలు ఆయుర్వేదం నుంచి అన్ని వైద్య విధానాల్లోనూ నెయ్యి ఆరోగ్యానికి మంచిదనే చెబుతుంటారు. ఇందులో పోషకాలు చాలా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, హెల్తీ ఫ్యాట్ పుష్కలంగా ఉంటాయి. రోజూ తగిన మోతాదులో తీసుుకంటే నెయ్యితో చాలా ప్రయోజనాలు కలుగుతాయి