Vinayaka Chavithi 2024: ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదిన వినాయ చవితి పండగ వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగాలు దాదాపు 100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగాల్లో ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
అరుదైన యోగాలు:
ఈ సంవత్సరం వచ్చిన వినయక చవితి రోజున ఎంతో శక్తివంతమైన సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగాలు ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా ఈ రోజు బ్రహ్మ, ఇంద్ర యోగాల అరుదైన కలయిక కూడా జరగబోతోంది. అలాగే స్వాతి, చిత్రా నక్షత్రాలు కూడా కొన్ని రాశులవారికి శుభ స్థానంలో ఉండబోతోంది. ఈ అరుదైన ప్రత్యేకమైన యోగాల కారణంగా వినాయక చవితి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అంతేకాకుండా సమస్యలు కూడా దూరమవుతాయి.
లాభాలు పొందే రాశులు:
వృషభ రాశి: వృషభ రాశి వారికి వినాయక చివితి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. వీరికి వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలగడమే కాకుండా అనుకున్న విజయాలు కూడా సాధిస్తారు. దీంతో పాటు సంపద కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ఈ కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి కూడా వినాయ చవితి ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వీరికి సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు పనుల్లో విజయాలు కూడా కలుగుతాయి.
కన్య రాశి: కన్యా రాశి వారికి గణేష్ చతుర్థి రోజు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి వృత్తి జీవితంలో పురోభివృద్ధి లభించడమే కాకుండా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆనందం పెరుగుతుంది.
గరకతో వినాయకుని ఆరాధన:
గణేష్ పూజలో భాగంగా గరక ప్రత్యేకమైన ప్రముఖ్యతను కలిగి ఉంటుంది. గరక వినాయకుడికి ఎంతో ఇష్టం.. కాబట్టి పూజలో భాగంగా గణపతికి ఎడమ వైపున ఉంచడం ఎంతో శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా కుటుంబం మొత్తం ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.