Airtel net work: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..

Airtel net work: రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలకు అల్లకల్లోలంగా మారిపోయాయి. కనీసం తినడానికి  తిండి, కట్టుకొవడానికి బట్టలు లేక చాలా మంది ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. 
 

1 /5

తెలుగు స్టేట్స్ లు కూడా భారీ వర్షాల నేపథ్యంలో చిగురుటాకుల్లో వణికిపోయాయని చెప్పుకొవచ్చు. కుండపోతగా కురిసిన వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా... ఇప్పటికి కూడా పలు ప్రాంతాలలో వరద ప్రభావం ఏమాత్రం కూడా తగ్గుముఖం పట్టలేదు.  

2 /5

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయవాడ వర్షాలకు కుదేలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మంకు వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అంతేకాకుండా.. అన్నిరకాలుగా ఉంటామని కూడా భరొసా ఇచ్చారు. అధికారులు సహాయకార్యక్రమాలు ముమ్మరం చేయాలని కూడా సూచించారు. 

3 /5

ఏపీలో చంద్రబాబు నాయుడు దగ్గరుండి సహాయ కార్యక్రమాలు చూస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలల పర్యటిస్తు ప్రజలకు కావాల్సిన నిత్యవసరాలు అందేలా చూస్తున్నారు. అంతేకాకుండా.. ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదంటూకూడా  ఆదేశాలు జారీ చేస్తున్నారు. కేంద్రతో మాట్లాడి హెలికాప్టర్ లు, బోట్ లు డిజాస్టర్ సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు. 

4 /5

మరోవైపు రెండు తెలుగు స్టేట్స్ లలో అల్లకల్లోలానికి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయా నాయకులు, సినీరంగా ప్రముఖులు సైతం తమ సహాయం అందిస్తున్నారు . ఈ క్రమంలో వరద ప్రభావం వల్ల ఉన్న ప్రజలకు ఎయిర్ టెల్ సైతం తన వంతుగా సహాయం అందించడానికి ముందుకొచ్చింది.  

5 /5

టెలికాం దిగ్గజం  సంస్థ భారతీ ఎయిర్ టెల్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరదల నేపథ్యంలో భారీ మినహాయింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ప్రీపెయిడ్ వినియోగ దారులకు 4 రోజులు అదనంగా వ్యాలిడీటీ, కాల్స్ తో పాటు, 4 రోజులు ప్రతిరోజు.. 1.5 జీబీ మొబైల్ డేటా ను ఇవ్వనుంది. అదే విధంగా పొస్ట్ పెయిడ్ వాళ్లకు చెల్లింపులకోసం, వైఫై వాళ్లు కూడా డబ్బులు చెల్లించడం కోసం.. మరో వారంపాటు గడువును ఇచ్చినట్లు తెలుస్తోంది..అదే విధంగా ఎయిర్ టెల్ నెట్ వర్క్ పరంగా ఎక్కడ కూడా ఇబ్బందులు కల్గకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది.