Chiranjeevi Home Tour: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభంగా నిలిచిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు. అందులో భాగంగానే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రూ.100 కోట్లతో నిర్మితమైన ఇల్లు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
జానర్ ఏదైనా సరే ఒదిగిపోయి నటించడంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా. కామెడీ, యాక్షన్, విలన్, డివోషనల్ ఇలా ఏ పాత్ర అయినా సరే అందులో లీనమైపోయి మరీ నటిస్తారు. దేశవ్యాప్తంగా విపరీతమైన సొంతం చేసుకున్న చిరంజీవి నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు.ఇక ఈ సందర్భంగా ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే చిరంజీవి నిర్మించుకున్న ఒక ఇల్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . ఈ ఇంటి ముందు ఫలక్ నుమా ప్యాలెస్ కూడా తక్కువే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నాలుగు దశాబ్దాలు చిత్ర పరిశ్రమలో చిరంజీవి ఆస్తులు బాగానే కూడబెట్టారు. డబ్బును జాగ్రత్త చేయడంతో పాటు వ్యాపారాలలో కూడా పెట్టుబడి పెట్టారు. అంతేకాదు విదేశాలలో కూడా హోటల్స్ రంగంలో సొమ్మును పెట్టుబడిగా పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రూ.100 కోట్లతో అధునాతన సౌకర్యాలతో తన డ్రీమ్ హౌస్ ను నిర్మించుకున్నారు.
జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి చిరంజీవి ఇల్లు సమీపంలో ఉంటుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్ యా దీనిని డిజైన్ చేశారు. 25వేల చదరపు అడుగుల స్థలంలో చాలా అద్భుతంగా అత్యంత సుందరంగా ఈ ఇంటిని నిర్మించారు.
ఇందులో ఉండే సదుపాయాల విషయానికి వస్తే, ఉదయం సమయంలో సూర్యుడి అందాలు ఆస్వాదించేలా రెండవ అంతస్తులో స్విమ్మింగ్ పూల్ నిర్మించడం జరిగింది. కింద అంతస్తులో దేవుడి గది.. దేవాలయాన్ని తలపిస్తుంది. దేవుడి ఫోటోలతో పాటు తన తండ్రి ఫోటో, మామ అల్లు రామలింగయ్య ఫోటోలు కూడా మనం చూడవచ్చు.
ఈ మధ్యకాలంలోనే వాస్తు సలహాలకు అనుగుణంగా కొన్నింటికి మార్పులు కూడా చేశారు. ఒక హైదరాబాదులోనే కాదు బెంగళూరులో కూడా మరో అందమైన ఇంటిని చిరంజీవి నిర్మించారు. అందరి మధ్య సఖ్యతలు ఉండాలని, విభేదాలు రాకుండా ఉండడం కోసం ప్రతి హాలిడే లేదా ప్రతి పండుగకు కుటుంబ సభ్యులంతా అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసి వస్తారు అని సమాచారం.