Bangladesh Crisis: ఆ తప్పు వల్లే షేక్ హసీనాకు ఈ గతి.. మాజీ పీఎంపై సంచలన ట్విట్ చేసిన రచయిత్రి తస్లీమా నస్రీన్..

Taslima Nasreen On Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన ట్విట్ చేసింది. గతంలో తనను బంగ్లాదేశ్ కు రాకుండా చేశారని అన్నారు. ఈరోజు షేక్ హసీనాకు అదే గతి పట్టిందని కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. 
 

1 /8

వివాదస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్.. చేసిన ట్విట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. ముఖ్యంగా గతంలో తనతో షేక్ హసీనా పీఎంగా ఉన్నప్పుడు, ఇస్లాం వారి మన్ననల కోసం తనను దేశంలలో రాకుండా చూశారని తస్లీమా ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 

2 /8

బంగ్లాదేశ్ లో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వేషన్ ల అంశం ఏకంగా ప్రభుత్వాన్ని కుదిపేసింది. అంతేకాకుండా పీఎంను షేక్ హసీనాను రాజీనామా చేసిన దేశం వదిలిపారిపోయేలా కూడా చేసింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. 

3 /8

షేక్ హసీనాకు లండన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు కూడా భారత్ లోనే ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోబాల్ తో భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకూడా అప్రమత్తమైంది. అదే విధంగా సరిహద్దు భద్రత దళాలు అలర్ట్ అయ్యాయి.   

4 /8

బంగ్లాదేశ్ లో అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. వివాదస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన ట్విట్ చేశారు.  ప్రస్తుతం ఇది గొడవలకు మరింత ఆజ్యాన్ని పోసేదిగా మారిందని చెప్పుకొవచ్చరు. తస్లీమా నస్రీజ్ ఎక్స్ వేదిగా, షేక్ హషనా పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

5 /8

1999 కాలంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ పీఎంగా ఉన్నారు. అప్పుడు తాను బంగ్లాదేశ్ లోకి రావోద్దని ఆదేశాలు జారీచేసింది. తన తల్లి చివరి చూపులకు కూడా నోచుకోకుండా కఠినమైన ఆంక్షలు విధించారని గుర్తు చేసుకుంది. 

6 /8

కేవలం కొంత మంది ఇస్లామిస్టులను తనవైపు తిప్పుకునేందుకు మాజీ పీఎం షేక్ హసీనా రాజకీయాలు చేశారని అన్నారు. ఇప్పుడు.. అదే ఇస్లామిక్ ప్రభావంతో ఈరోజు దేశంవిడిచి పారిపోవాల్సి వచ్చిందని సెటైర్ లు వేశారు.   

7 /8

అంతేకాకుండా.. బంగ్లాదేశ్ ను ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీపాలన ఉండకూడదని అన్నారు. లేకుంటే బంగ్లాదేశ్ కూడా మరో పాకిస్థాన్ అవుతుందని ఆమె తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజలచేత కొత్త ప్రభుత్వం ఏర్పడే దిశగా అధికారులు చొరవ చూపాలని తస్లీమా పేర్కొన్నారు.   

8 /8

ప్రస్తుతం బంగ్లాలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పినట్లు తెలుస్తోంది. ఆందోళన కారులు విచ్చల విడిగా తిరుగుతున్నారు. పీఎం భవనంలోకి ప్రవేశించి అందిన కాడిని ఫర్నీచర్ ను దొచుకుపోతున్నారు. బంగ్లాజాతీపిత విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. అక్కడి సోషల్ మీడియా, ఇంటర్నేట్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.