Best Tourist Places: వివిధ ప్రాంతాల్ని సందర్శించేందుకు వర్షాకాలం సరైన సమయం. అందులోనూ ఆగస్టు నెల. ఈసారి ఆగస్టు నెలలో లాంగ్ వీకెండ్ వస్తోంది. జాగ్రత్తగా ప్లాన్ చేస్తే 5 రోజులు హాయిగా తిరిగి రావచ్చు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం కాగా 17,18 తేదీలు శని, ఆదివారాలు. ఆగస్టు 19 రక్షాబంధన్. మధ్యలో ఆగస్టు 16న సెలవు పెడితే చాలు..ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ఉంటుంది.
Best Tourist Places: ఆగస్టు 14 సాయంత్రం బయలు దేరితే 5 రోజులు తిరిగి రావచ్చు. మరి ఈ లాంగ్ వీకెండ్ ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తుంటే మీ కోసం 5 బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ వివరాలు ఇస్తున్నాం. మీకు ఏది అనుకూలమూ అది ప్లాన్ చేసుకోవచ్చు
మహారాష్ట్ర మహారాష్ట్రలోని చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాంతం. అజంతా, ఎల్లోరా గుహలు సందర్శించేందుకు ఆగస్టు నెల బెస్ట్ ఆప్షన్. ముంబై సముద్ర తీరం, పూణే హిల్ స్టేషన్లు కూడా ఈ ఐదు రోజుల్లో తిరిగి రావచ్చు.
కేరళ గాడ్స్ ఓన్ కంట్రీగా పిల్చుకునే కేరళలోని అందమైన ప్రాంతాలు సందర్శించేందుకు ఆగస్టు నెల బెస్ట్ సీజన్. అందమైన లోయలు, తోటలు, హిల్ స్టేషన్స్, జలపాతాలు ప్రకృతి అందాలు చూడాలంటే కేరళలో చాలా ప్రాంతాలున్నాయి. హౌస్ బూటింగ్ మరో ప్రత్యేకత.
రాజస్థాన్ రాజస్థాన్ అంటేనే అద్భుతమైన కోటలు, ప్యాలెస్, ఎడారి ప్రాంతాలకు ప్రసిద్ధి. వేసవిలో వేడి తట్టుకోలేరు. కానీ వర్షాకాలం చాలా బాగుంటుంది. జయపూర్, ఉదయపూర్, జోధ్ పూర్ ప్రాంతాలు సందర్శించేందుకు బెస్ట్ ప్లేసెస్.
షిల్లాంగ్ ఇండియాలో అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి . ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతితో జీవిస్తున్నట్టు ఉంటుంది. అందమైన జలపాతాలు మీ జర్నీని మధురంగా మారుస్తాయి
గోవా గోవా దేశంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన బీచ్ డెస్టినేషన్. సముద్రతీరాన పడుకుని ప్రకృతిని ఎంజాయ్ చేయవచ్చు. వాటర్ స్పోర్ట్స్ చాలా థ్రిల్లింగ్ ఇస్తాయి.