BSNL Sim Card: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. నచ్చిన ఫ్యాన్సీ నంబర్ తో సిమ్ కార్డు.. ఇలా సెలక్ట్ చేసుకొండి..

BSNL Sim card: కొన్నిరోజులుగా బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ వైపు ఎక్కువ మంది కస్టమర్లు పొర్ట్ అవుతున్నారు.ఈక్రమంలో కస్టమర్లుకు సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట నచ్చిన ఫోన్ నెంబర్ ను ఎంచుకునే అవకాశం కల్పించింది.
 

1 /6

కొన్నిరోజులుగా బీఎస్ఎన్ఎల్ కు కస్టమర్లు పొట్టేత్తారు. ఇప్పటికే జియో,ఎయిర్ టెల్ లు రీచార్జీ ధరలను భారీగా పెంచేయడంతో.. బీఎస్ఎన్ఎల్ వైపుకు ఎక్కువ మంది పొర్ట్ అవుతున్నారు. ప్రతిరోజు పొర్ట్ అయ్యే వారి సంఖ్య క్రమంగా  పెరుగుతు వస్తుంది.   

2 /6

ఇదిలా ఉండగా..ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొని వస్తున్న 4 జీ సేవలు అన్నిచోట్ల అమలయ్యేలా సంస్థ స్పీడును పెంచింది.ఈ నేపథ్యంలో. బీఎస్ఎన్ఎల్ ఇక మీదట మనకు నచ్చిన నెంబర్ ను మనం ఫోన్ నంబర్ గా ఎంచుకొవచ్చు. దీంతో కస్టమర్లు ఎక్కువ మంది సిమ్ కార్డులు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

3 /6

ముందుగా కస్టమర్లు.. సెర్చ్ ఇంజిన్ లో.. బీఎస్ఎన్ఎల్ చూస్ యూవర్ మొబైల్ నంబర్ అని సెర్చ్ చేయాలి. ఆతర్వాత వెబ్ పేజ్ లో.. సీవైఎమ్ఎన్ పై క్లిక్ చేయాలి. 

4 /6

మీ జోన్ , స్టేట్ ను ఎంచుకొవాలి.నచ్చిన ఫోన్ నంబర్ కోసం వెతికేందుకు ఆప్షన్ వస్తుంది. అందులో.. సెర్చ్ విత్ సిరిస్, స్టార్ట్ నంబర్, ఎండ్ నంబర్, సమ్ నంబర్ అని నాలుగు ఆప్షన్లు ఉంటాయి.

5 /6

ఒకవేళ ఫ్యాన్సీ నంబర్ కావాలిస్తే.. పక్కనే మరో ఆప్షన్ ఉంటుంది. వీటిని ఎంచుకుని సెర్చ్ చేయాలి. మనం ఎంటర్ చేసిన డాటా  ఆధారంగా కొన్ని నంబర్ లను చూపిస్తుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్ ను దానిలో ఎంటర్ చేయాలి.

6 /6

అప్పుడు ఫోన్ కు  ఓటీపీ వస్తుంది. వెంటనే ఆ నంబర్ రిజర్వ్ అవుతుంది.ఆ తర్వాత దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ కు వెళ్లి సిమ్ కార్డు తీసుకొవచ్చు.ఈ క్రమంలో ఈ ఫెసిలీటితో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మరింత ఆసక్తి చూపిస్తున్నారు.