Shani Dev - Shukra Transit: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికను అద్భుతంగా భావిస్తుంటారు. వేద జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు, శని దేవుడు ఇద్దరు మిత్ర గ్రహాలు. ఈ రెండు గ్రహాలు సమ సప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆగష్టులో శుక్రుడు, శని దేవుడు కలిసి మంచి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీంతో ఈ నాలుగు రాశుల వారు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఆర్ధిక కష్టాలకు పులిస్టాప్ పడనుంది.
Shani Dev - Shukra Transit: ఆగష్టు నెలలో శని దేవుడు, శుక్రుడు సమ సప్తక యోగంతో పాటు సింహరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.బుధుడు, శుక్రుడు, సూర్యుడు కలిసి ఉంటడం కూడా మంచి యోగంగా పరిగణిస్తారు. శుక్ర, శని స్థానాల ద్వారా ఏ రాశుల వారు ధనవంతులు కాబోతున్నారో చూద్దాం..
వృషభ రాశి.. సమ సప్తక యోగం వలన వృషభ రాశి వారికీ ఎంతో మేలు జరగబోతుంది. ఈ యోగ ప్రభావం వల్ల ఈ రాశుల వారు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న ఆర్ధిక కష్టాలు తొలిగిపోతాయి. మీరు కార్యాలయంలో సహోద్యోగులు మరియు సీనియర్ల నుండి తగిన మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపే అవకాశం లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి.
కర్కాటక రాశి: శని-శుక్రుడు ఏర్పడిన సమసప్తక యోగం కర్కాటక రాశి వారికి మేలు చేయబోతోంది. ఈ యోగాతో మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేక రెట్లు పెరుగుతాయి. వివాహం నిశ్చయించవచ్చు. అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు.
తులారాశి : శుక్ర, శని సమ సప్తక యోగం వలన తులారాశి వారు మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ సమయంలో ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన వారికీ అనుకోని లాభాలు కలుగుతాయి. అంతేకాదు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
కుంభ రాశి.. కుంభ రాశి వారికి శని-శుక్రుల కలయిక మేలు చేస్తుంది. కుంభ రాశికి అధిపతి శని దేవుడు. సాధారణంగా కుంభ రాశి సొంత రాశి అయినందున ఈ రాశుల వారిపై శని దేవుడి అపార అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. శుక్ర మరియు శని కలయిక మీకు ఆర్థికంగా లాభాలను అందుకుంటారు. అంతేకాదు మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అంతేకాదు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.