Olympic medal story: ప్రస్తుతం ప్రపంచ క్రీడలు పారిస్ లో జరుగుతున్నాయి. అనేక మంది క్రీడాకారులు, ఆయా క్రీడాంశాలలో తమ సత్తాచాటుతున్నారు. ఇదిలా ఉండగా.. క్రీడాకారులు మెడల్స్ ను గెలుచుకున్నాక మాత్రం దాన్ని ఒకసారి కొరికి మరీ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు.
ఒలింపిక్స్ ను కొన్ని వందల ఏళ్ల నుంచి నిర్వహించుకుంటు వస్తున్నారు. ప్రస్తుతం పారీస్ లో విశ్వక్రీడలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఆయా క్రీడాకారులు మెడల్స్ లను గెలవగానే దాన్ని కొరికి ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంతో ఇప్పుడు చూద్దాం.
ఒలింపిక్స్ లో గెలిచాక మెడల్ ను కొరకడం వందల ఏళ్ల నుంచి వస్తుంది. పతకంను కోరికి మరీ అథ్లేట్లు ఫోటోలకు పోజులిస్తుంటారు. పూర్వ కాలంలో మెడల్స్ తయారీలో బంగారు నాణేలు వాడేవారు. ఆ సమయంలో వ్యాపారులు బంగారు నాణేలను వాటి స్వచ్ఛతను తనిఖీ చేసేవారు.
బంగారం మెత్తటి లోహం కాబట్టి,దాన్ని కొరకగానే దంతాల గుర్తులు పడితే అది నిజమైన బంగారం అని, ఒక వేళ దంతాల గుర్తులు పడకుంటే మాత్రం దానిలో ఇతర పదార్థాలు కలిపారని చెప్తుంటారు. కాబట్టి ఒలింపిక్ అథ్లెట్లు తమ పతకం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి బంగారు పతకాలను ఇలా చేసేవారని అంటుంటారు.
ఇదిలా ఉండగా.. 1912 నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్వచ్ఛమైన బంగారు పతకాలను అందించడం ఆపేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇలా చేయడానికి కారణం దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం కాదు. దాని వల్ల ఇబ్బందులు కూడా ఏర్పడతాయని కొందరు చెప్తున్నారు.
2010లో ఒలింపిక్స్లో పతకాల్లో ఓ షాకింగ్ ఘటన ఒకటి జరిగింది. జర్మన్ లూగర్ డేవిడ్ ముల్లర్ వింటర్ ఒలింపిక్స్లో తన రజత పతకాన్ని గెలవడానికి ఇలాంటి పోజులిచ్చాడు. అతగాడు..తన పతకంను దంతాలతో కాస్తంతా అత్యుత్సాహంతో గట్టిగా కోరికాడు. అప్పుడు.. అతని దంతాలు విరిగిపోయాయంట. అప్పట్లో అది వివాదాస్పదంగా మారింది.
కానీ ఇప్పటికి కూడా ఒలింపిక్స్ లో పాల్గొని పతకం సాధించిన వారు మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మెడల్ ను నోటితో కొరికి మరీ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఇప్పటికి ఇదే సాంప్రదాయం పాటిస్తున్నారు.