India vs Sri Lanka T20I Dream11 Team Tips and Playing 11: శ్రీలంకపై వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్న నేడు ఆఖరి, మూడో మ్యాచ్‌లో తలపడనుంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్‌గా, గౌతం గంభీర్ కోచ్‌గా తొలి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. మెడ కండరాలు పట్టేయడంతో రెండో మ్యాచ్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో విశ్రాంతినివ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. గిల్ స్థానంలో సంజు శాంసన్ మరోసారి ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. శ్రీలంకలోని బాలగొల్లలోని స్టేడియం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. భారత్ , శ్రీలంకలు ఇప్పటి వరకు 31 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. భారత్ 21 విజయాలు సాధించగా.. శ్రీలంక తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పిచ్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. పల్లెకెలె స్టేడియంలోని పిచ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించింది. పిచ్‌పై మంచి బౌన్స్ ఉండడంతో పండగ చేసుకున్నారు. అయితే స్పిన్నర్లకు కొంచెం సహకారం లభిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో బంతి ఎక్కువ టర్న్ అవుతుంది. ఈ వేదికపై ఇది వరుసగా మూడో మ్యాచ్ కావడంతో ఇదే పిచ్‌ని ఉపయోగిస్తే స్పిన్నర్లకు మరింత సహకారం లభించవచ్చు.
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక.
IND vs SL Dream11 Team Tips:
వికెట్ కీపర్లు: రిషబ్ పంత్, కుశాల్ మెండిస్
బ్యాటర్లు: యశస్వి జైస్వాల్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, పాతుమ్ నిస్సాంక
ఆల్ రౌండర్: అక్షర్ పటేల్, కమిందు మెండిస్, హార్దిక్ పాండ్యా
బౌలర్లు: మతీషా పతిరనా, మహేశ్ తీక్షణ (వైస్ కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్.
Also Read: Snake: నాగ పంచమికి ముందు అరుదైన ఘటన.. నాగ దేవత విగ్రహం మీద పడగ విప్పిన నాగు పాము.. వీడియోవైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి