Katrina Kaif Diet Plan: బాలీవుడ్‌ సెలిబ్రిటీ కత్రినాకైఫ్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో మీకు తెలుసా?

Actress Katrina Kaif Fitness Secret: కత్రినా కైఫ్ తన అందం, ఫిట్‌నెస్‌కు ఎంతగా ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలుసు. ఆమె ఈ అందాన్ని కాపాడుకోవడానికి చాలా సింపుల్ గా ఉండే డైట్ ప్లాన్‌ని ఫాలో అవుతుందని తెలియగానే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. 


Actress Katrina Kaif Fitness Secret: బాలీవుడ్ నటి  కత్రినా కైఫ్ ఎంత అందంగా ఉంటుందో అంతే ఫిట్‌గా ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్ కు కారణం ఆమె తీసుకునే ఆహారమే అని తెలుసా? ఆమె సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెప్పిన  ప్రకారం, కత్రినాకు ఆహారం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని, వీటితో పాటు వ్యాయామం కూడా చేస్తారని తెలిపారు. అయితే ఇంకు కత్రినా కైఫ్‌ ఎలాంటి డైట్‌ ఫాలో అవుతారు? ఆమె తీసుకొనే ఆహారం ఏంటో తెలుసుకుందాం. 
 

1 /10

సహజంగా నటలు బయట ఆహారాన్నికి ఎక్కువ ప్రముఖ్యత ఇస్తుంటారు. కానీ కత్రినా కైఫ్ మాత్రం బయట ఆహారం అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదని ఆమె న్యూటిషనిస్ట్‌ తెలిపారు. ఎక్కడికి వెళ్లినా తనతో తాను ఇంటి ఆహారాన్ని తీసుకువెళ్తుందట.   

2 /10

ఆయిల్ పుల్లింగ్, నాసికలను శుభ్రపరచడం, షత్పవలి వంటి సాంప్రదాయ పద్ధతులను రోజూ ఖచ్చితంగా పాటిస్తారంట.  

3 /10

అమె సరళమైన జీవనశైలిని పాటిస్తారు. బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ అయినప్పటికి  ఇలాంటి డైట్‌ అచరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది కత్రినా న్యూట్రీషనిస్ట్ తెలిపారు.  

4 /10

కత్రినా ఆహారంలో ఎక్కువగా వివిధ రకాల పోషకాలు కూడిన ఆహారపదార్థాలు తింటారంట.   

5 /10

కత్రినాకు పిత్త ప్రకృతి ఉండటం వల్ల ఆమె శరీరం వేడిగా ఉంటుంది. దాంతో ఆమె శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.  

6 /10

నల్ల ఎండుద్రాక్ష, సోంపు, బూడిద గుమ్మడి కాయ రసం, ఉసిరికాయ రసం, పుదీనా కొత్తిమీర రసాలు వంటి ఆహారాలు పిత్త ప్రకృతికి చాలా మంచివి.  

7 /10

 కత్రినా గంటకోసారి తినడం కన్నా రోజుకు రెండు సార్లు కడుపునిండా తినడం ఇష్టపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన అలవాటు అని న్యూటిషనిస్ట్‌ చెబుతున్నారు.  

8 /10

 కత్రినా కైఫ్ ద్వారా ఇంట్లో తయారుచేసిన ఆహారం ఎంత ఆరోగ్యకరమైనదో మరోసారి తెలుస్తుంది.

9 /10

కత్రినా కైఫ్ లాంటి బాలీవుడ్ స్టార్ కూడా  మన పూర్వీకులు అనుసరించే సాంప్రదాయ పద్ధతులు పాటిస్తున్నారు అటే ఇది  ఆరోగ్యానికి మంచి చేస్తాయని తెలుస్తుంది.

10 /10

 ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పకుండా మీ డాక్టర్‌ను సంప్రదించండి.