Bajaj CNG Bike Pics: ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్, ఫుల్ ట్యాంక్ చేస్తే ఢిల్లీ టు షిమ్లా పోవచ్చు

బజాజ్ కంపెనీ ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ బైక్ Bajaj Freedom 125 లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ బైక్ ఒకసారి ఫ్యూయల్ ఫుల్ చేస్తే ఏకంగా 330 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే ఢిల్లీ నుంచి షిమ్లాకు వెళ్లిపోవచ్చు.

Bajaj CNG Bike Pics: బజాజ్ కంపెనీ ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ బైక్ Bajaj Freedom 125 లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ బైక్ ఒకసారి ఫ్యూయల్ ఫుల్ చేస్తే ఏకంగా 330 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే ఢిల్లీ నుంచి షిమ్లాకు వెళ్లిపోవచ్చు.
 

1 /5

Bajaj Freedom 125 ధర ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ ధర 95 వేలతో ప్రారంభమౌతుంది.ఈ బైక్ మూడు వేరియంట్లలో లభ్యమౌతుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర 1.10 లక్షలుగా ఉంది. ఇందులో మిడ్ వేరియంట్ ధర 1.05 లక్షలు. 

2 /5

Bajaj Freedom 125 బజాజ్ కంపెనీ లాంచ్ చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ ఇది. ఈ బైక్ పెట్రోల్, సీఎన్జీ రెండింటితో నడుస్తుంది. భారతీయ రోడ్లను దృష్టిలో ఉంచుకుని తయారైంది. 

3 /5

Bajaj Freedom 125 పనితీరు బజాజ్ ఫ్రీడమ్ 125 సిసిలో సింగల్ సిలెండర్ ఉంటుంది. ఇది పెట్రోల్, సీఎన్జీ రెండింటిపై పనిచేస్తుంది. ఇందులో 2 లీటర్ పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్‌తో పాటు సీటు కింద 2 కిలోల సీఎన్జీ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ ఇంజన్ 9.5 పీఎస్ పవర్, 9.7 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఒకసారి ఫ్యూయల్ ఫుల్ చేస్తే 330 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

4 /5

Bajaj Freedom 125 ఫీచర్లు బజాజ్ ఫ్రీడమ్ 125లో ఫుల్ ఎల్ఈడీ హెడ్ అండ్ టెయిల్ లైట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇందులో మోనోక్రోమ్ ఎల్‌సిడి డిస్‌ప్లే ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. బైక్ తేలిగ్గా మార్చేందుకు రోబస్ట్ ట్రేలిస్ ఫ్రేమ్ అమర్చారు. ఇక డిజైన్ అయితే సాధారణ బైక్‌లానే ఉంటుంది. ఇందులో సీటు పొడవు ఎక్కువ. 

5 /5

Bajaj Freedom 125  బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ లాంచ్ తరువాత ఫ్యూయల్ ట్యాంక్ ఎంతవరకూ సురక్షితమనే విషయంపై సందేహాలు తలెత్తాయి. అందుకే లాంచ్‌కు ముందు చాలా టెస్ట్ లు జరిగాయి. బైక్‌పై నుంచి భారీ ట్రక్ నడిపినా సీఎన్జీ ట్యాంక్‌కు నష్టం వాటిల్లలేదు.