Trisha: పక్కన వాళ్ల గురించి అనవసరం.. సుచిత్రకి త్రిష ఇన్ డైరెక్ట్ కౌంటర్!

Trisha-suchitra leaks: ఈ మధ్యనే హీరోయిన్ త్రిష.. హీరో విజయ్ కి మధ్య ఉన్న సంబంధం గురించి.. సింగర్ సుచిత్ర సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి త్రిష తన ఇంస్టాగ్రామ్.. పోస్ట్ ద్వారా ఇన్ డైరెక్ట్ గా స్పందించింది. పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం ఉత్తమం అంటూ కామెంట్స్ చేసింది..
 

1 /5

నీ మనసు నాకు తెలుసు.. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన.. తమిళ భామ త్రిష. ఆ తరువాత ప్రభాస్ తో.. చేసిన వర్షం సినిమా.. ఈ హీరోయిన్ కి మంచి సక్సెస్ అందించింది. అప్పటినుంచి త్రిషకు తెలుగులో వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి 

2 /5

దాదాపు రెండు దశాబ్దాల నుంచి.. తెలుగు, తమిళ భాషల్లో.. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది త్రిష. ఈ మధ్యనే మణిరత్నం.. దర్శకత్వంలో వచ్చిన పోనియన్ సెల్వన్.. సినిమాలో కనిపించి మరింత మెప్పించింది. 

3 /5

ఇక త్రిష కి ఆఫర్లు రావు అనుకున్న సమయంలో ఈ సినిమా ఆమె కెరియర్ను మరోసారి మార్చేసింది. ప్రస్తుతం మళ్ళీ త్రిషకు తమిళ తెలుగు భాషల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో త్రిష చిరంజీవి విశ్వంభరా సినిమాలో కనిపించనుంది 

4 /5

చిరంజీవి, త్రిష కలిసి స్టాలిన్ సినిమాలో.. నటించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నో సంవత్సరాల..తర్వాత విశ్వంభర సినిమాతో.. ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోపక్క తమిళంలో.. కూడా వరుస అవకాశాలు.. అందుకుంటూ దూసుకుపోతాంది. 

5 /5

ఈ క్రమంలో త్రిష ఇంస్టాగ్రామ్ లో.. షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలకు.. పక్కన వాళ్ళ ఒపీనియన్స్ గురించి పట్టించుకోవద్దండి అని.. క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ మధ్య.. సింగర్ సుచిత్ర విజయ్, త్రిష గురించి కొన్ని కామెంట్లు.. చేసిన సంగతి తెలిసిందే. దీనికి జవాబు గానే త్రిష ఈ కామెంట్ పెట్టి.. ఉంటది అనుకుంటున్నారు అభిమానులు.