Weight Loss In 30 days: ప్రస్తుతం ఊబకాయం అనేది సాధారణ సమస్యగా మారింది. చిన్న పెద్ద తేడా కూడా సులభంగా బరువు పెరుగుతున్నారు. శరీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా సులభంగా ఊబకాయం బారిన పడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోజు తీసుకునే ఆహారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. చాలా మంది బరువు తగ్గినప్పటికీ పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలేకపోతున్నారు. అయితే ఆహారాల్లో ఈ చిన్న మార్పులు చేసుకుంటే సులభంగా బరువు తగ్గడమే కాకుండా బెల్లీ ఫ్యాట్‌ను కూడా సులభంగా నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గడానికి ఇవి తప్పకుండా చేయండి:
1. పిండి పదార్థాలు:
మైదా పిండి, ఇతర పిండిలకు సంబంధించిన ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వీటితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల కొవ్వు వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య ససమ్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్యాక్డ్ ఫుడ్‌తో పాటు ఫాస్ట్ ఫుడ్‌లో ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో వీటిని తినకుండా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. చక్కెర:
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా శరీర బరువు పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు శరీరంలోని క్యాలరీలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చక్కెర తీసుకోవడం వల్ల ఎక్కువగా కొవ్వు నిల్వ అవుతుంది. దీని కారణంగా బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉంది.
3. ఫ్రూట్ జ్యూస్:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకుంటున్నారు. అంతేకాకుండా బరువు తగ్గే క్రమంలో కూడా జ్యూస్‌లు తాగుతున్నారు. నిజానికి ఇలా తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కూడా బరువు పెరగొచ్చు. కాబట్టి బరువు తగ్గడానికి ప్రతి రోజు జ్యూస్‌లకు బదులుగా పండ్లను నేరుగా తినడం మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
4. కూల్ డ్రింక్స్:
ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగడం ట్రెండ్‌గా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి దీని బదులుగా నిమ్మరసం తాగడం చాలా మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి