NEET 2024 ROW: నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ప్రతిపక్షాలకు అస్త్రంగా నీట్ వ్యవహారం

NEET 2024 ROW: నీట్ 2024 వివాదం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది. యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దుతో నీట్ వివాదంపై ప్రతిపక్షాలకు మరో అస్త్రం లభించింది. నీట్ 2024 అవకతవకల వ్యవహారంపై రేపు దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2024, 08:44 AM IST
NEET 2024 ROW: నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ప్రతిపక్షాలకు అస్త్రంగా నీట్ వ్యవహారం

NEET 2024 ROW: దేశ వ్యాప్తంగా ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ 2024 పరీక్ష వివాదం కొనసాగుతుండగానే అదే ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు రుజువు కావడంతో కేంద్ర ప్రభుత్వం మొత్తం పరీక్షనే రద్దు చేసింది. దీంతో ఎన్టీయే పరిస్థితి ప్రశ్నార్ధకమౌతోంది.

నీట్ 2024 పరీక్ష ఫలితాల్లో అక్రమాలు, అవకతవకలు, గ్రేస్ మార్కుల వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు 1563 మంది విద్యార్ధులకు కలిపిన గ్రేస్ మార్కుల్ని తొలగించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అంతేకాకుండా ఆ 1563 మందికి రీ నీట్ 2024 నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. నీట్ 2024 పరీక్ష అవకతవకల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది. మరోవైపు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ వ్యవహారంపై స్పందించింది. NEET UG 2024 అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలతో సుప్రీంకోర్టులో పిటీషన్ల వ్యవహారంపై నివేదిక కోరింది. 

ఈ వ్యవహారానికి తోడు అదే ఎన్టీయే ఇటీవల అంటే జూన్ నెలలో నిర్వహించిన యూజీసీ నెట్ 2024 పరీక్ష పేపర్ లీకేజ్ ఘటన వ్యవహారం సంచలనమైంది. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నెట్ పరీక్షను మొత్తం రద్దు చేసింది. దీనిపై తదుపరి విచారణను సీబీఐకు అప్పగించింది. ఈ వ్యవహారంతో అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇటు కేంద్ర ప్రభుత్వం మరింత ఇరుకునపడ్డాయి.

నీట్ వివాదంపై ఆజ్యం పోసిన యూజీసీ నెట్ రద్దు

యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దుతో నీట్ 2024 వివాదాన్ని ఆజ్యం పోసినట్టయింది. కాంగ్రెస్ ఈ వివాదాన్ని అస్త్రంగా మల్చుకుంటోంది. నీట్ పరీక్షపై  ఎప్పుడు చర్చిస్తారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. యువత భవిష్యత్‌ను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి తొలుత నీట్ పేపర్ లీక్ కాలేదని చెప్పారని కానీ బీహార్, గుజరాత్, హర్యానాలో ఈ వ్యవహారంపై కొంతమందిని అరెస్టు చేసిన తరువాత కుంభకోణం జరిగిందని ఒప్పుకుందని మల్లికార్జున ఖర్గే తెలిపారు.

నీట్ 2024 పరీక్షను ఎప్పుడు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. రేపు ఇదే అంశంపై జూన్ 21న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 

Also read: UGC NET Cancel: కేంద్రం సంచలన నిర్ణయం.. అవకతవకలతో యూజీసీ నెట్‌ పరీక్ష రద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News