Aadhaar Card Update Method: ఫ్రీ బస్సులో మీ ఆధార్ కార్డు చాలటం లేదా? ఆధార్ కార్డు ఆప్డేట్ కోసం మీ-సేవ షాపుల చుట్టూ తిరుగుతున్నారా? ఇకపైన ఆ అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా మీ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.
Aadhaar Card Update Method: ఆధార్ అనేది భారత ప్రభుత్వం అందించే ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు. ఈ కార్డులో ఇది 12-అంకెల సంఖ్య ఉంటుంది. ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడికి కేటాయించబడుతుంది. ఈ కార్డును Unique Identification Authority Of India (UIDAI) జారీ చేస్తుంది. ఆధార్ కార్డు అనేక ప్రభుత్వ పథకాలకు ప్రయోజనం పొందడానికి అవసరం, ఉదాహరణకు సబ్సిడీలు, పెన్షన్లు ,స్కాలర్షిప్లు. అయితే కొన్ని సందర్భాల్లో మీరు ఆధార్ కార్డులోని వ్యక్తిగత సమాచారాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ ఫోటో, పేరు, ఇంటి చిరునామ ఇలా.. అయితే దీని కోసం మీరు మీ-సేవ కేంద్రలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సలభంగా చేసుకోవచ్చు.
ఆధార్ కార్డ్‌లో ఉండే మీ వివిరాలు మార్చుకోవడానికి ముందుగా మీరు UIDAI వెబ్‌సైట్‌ను ఆన్లైన్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది.
మీ ఆధార్ వివిరాలు మార్చుకోవాడానికి అధికారిక వెబ్‌సైట్‌ను UIDAI విజిట్ చేయండి.
ఆ తరువాత లింక్‌ను క్లిక్ చేసి ఆధార్ హోం పేజ్‌కు వెళ్ళి. ఇందులో ఆధార్ అడ్రస్, ఫోన్ నంబర్, పేరు, పుట్టన తేదీ ఎలా మార్చుకొనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో MY Aadhaar ట్యాబ్ కింద Update Aadhaar ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
తరువాత Update Aadhaar సెక్షన్లో Update Demographics Data Online ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్ స్కీన్‌పైన కనిపించే సెక్కూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. తరువాత send OTP బటన్‌పై క్లిక్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో OTPని వస్తుంది. ఈ విధంగా మీరు మీ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.