Healthy Drinks: రోజూ ఈ 5 డ్రింక్స్ తాగితే మధుమేం, ఎనీమియా అన్నింటికీ చెక్

దేశంలో చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది కాఫీ తాగుతుంటారు. కానీ రోజూ పరగడుపున టీ లేదా కాఫీ తాగితే శరీరంలో ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే టీ-కాఫీ స్థానంలో ఈ 5 హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే చాలా మంచిది.

Healthy Drinks: దేశంలో చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది కాఫీ తాగుతుంటారు. కానీ రోజూ పరగడుపున టీ లేదా కాఫీ తాగితే శరీరంలో ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే టీ-కాఫీ స్థానంలో ఈ 5 హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే చాలా మంచిది.

1 /5

ఇలాచీ నీరు గ్రీన్ ఇలాచీ నీరు రోజూ తాగడం వల్ల నోటి దుర్గంధం నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎసిడిటీ వంటి సమస్యలు దూరమౌతాయి. 

2 /5

మెంతి నీరు రోజూ ఉదయం నానబెట్టిన మెంతి గింజల నీరు తాగడం వల్ల ఇన్సూలిన్ రెసిస్టెన్స్, హై బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణ వంటి ప్రయోజనాలున్నాయి. శరీరంలో ఎదురయ్యే అలసట కూడా దూరమౌతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమౌతాయి.

3 /5

గిలోయ్ ఆకుల నీళ్లు గిలోయ్ ఆకుల నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరాన్ని చాలా సమస్యల్నించి రక్షిస్తుంది. జ్వరం, జలుబు వంటి సీజనల్ వ్యాధుల్ని దూరం చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. 

4 /5

మోరింగ నీళ్లు మోరింగ నీళ్లు ఆరోగ్యానికి చాలా లాభదాయకం. ఐరన్ లోపాన్ని దూరం చేస్తాయి. మోరింగలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇతర విటమిన్లు ఉంటాయి. రోజూ ఉదయం పరగడుపు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

5 /5

కొబ్బరి నీరు ఉదయం పరగడుపున టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. కడుపు సమస్య పెరుగుతుంది. పరగడుపున టీ తాగితే కడుపు నొప్పి, బ్లోటింగ్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అందుకే రోజూ టీ కాకుండా ఆ స్థానంలో కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా అద్భుతమైన ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.