Kalyana Lakshmi Tula Gold: గత ప్రభుత్వంలో అద్భుత పథకంగా నిలిచిన కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. దీనికి అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా తులం బంగారం ముచ్చట గాలికి వదిలేయడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన రూ.లక్ష సహాయం కూడా ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసింది. నగదు సహాయంతోపాటు తులం బంగారం కూడా ఇచ్చేందుకు నిధులు మంజూరు చేసింది.
Also Read: Revanth Reddy Chitchat: ఇక రాజకీయం ముగిసింది.. పరిపాలనపై దృష్టి సారిస్తా
తెలంగాణ రాష్ట్రంలోనిపేద వర్గాల వివాహా ఖర్చుల చెల్లింపునకు సంబంధించి కల్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష సహాయం ఇస్తుండగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా తులం బంగారం ఇచ్చేందుకు సిద్ధమైంది. వాటి కోసం ప్రభుత్వం రూ.725 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: KTR: అత్యధిక ఎంపీ స్థానాలు మావే.. ఎన్నికల్లో 'కారు'దే తిరుగులేని విజయం
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. లక్ష నగదుతో పాటు తులం బంగారం కూడా అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు ఆ హామీని నెరవేర్చుకునేందుకు సిద్ధమైంది. అయితే రూ. లక్ష నగదుతోపాటు అదనంగా తులం బంగారం కూడా అందించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తామని ఇప్పటివరకు ఒక ప్రకటన జారీ చేయలేదు. ప్రస్తుతం అధికారంలోకి ఆరు నెలల్లో గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే రూ.లక్ష సహాయం మాత్రమే చేస్తోంది. ఇవి కూడా అరకొరగా ఇస్తున్నారు. కల్యాణలక్ష్మి పథకం అటకెక్కించారనే విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఈ పథకానికి నిధులు విడుదల కావడం గమనార్హం.
కేసీఆర్ దాడితో మేల్కొన్న ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఈలోపే లోక్‌సభ ఎన్నికల ప్రకటన విడుదలైంది. మూడు నెలల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో గత ప్రభుత్వ పథకాలు కొనసాగుతున్నాయి మినహా కొత్త పథకాలు చేపట్టలేదు. ఎన్నికల కోడ్ అడ్డుగా పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలును మరచిపోయిందని బీఆర్ఎస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. తులం బంగారం తుస్సుమంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రతిపక్షాల విమర్శల దాడి తీవ్రవమవడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి కల్యాణలక్ష్మి పథకానికి నిధులు విడుదల చేసింది. మరి నగదుతోపాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter