Summer Face Packs: వేసవిలో ముఖం నల్లబడకుండా ఉండాలంటే ఈ 5 ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

వేసవి కాలంలో సహజంగానే ట్యానింగ్ సమస్య వెంటాడుతుంటుంది. ముఖం నల్లగా, నిర్జీవంగా మారిపోతుంటుంది. కొంతమందికైతే చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. చెమట పట్టడం, నల్లబడటం వంటి సమస్యలు ఎదురౌతాయి. ఈ సమస్యల్నించి గట్టెక్కి ముఖానికి నిగారింపు తీసుకురావాలంటే ఈ ఐదు ఫేస్ ప్యాక్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.

Summer Face Packs: వేసవి కాలంలో సహజంగానే ట్యానింగ్ సమస్య వెంటాడుతుంటుంది. ముఖం నల్లగా, నిర్జీవంగా మారిపోతుంటుంది. కొంతమందికైతే చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. చెమట పట్టడం, నల్లబడటం వంటి సమస్యలు ఎదురౌతాయి. ఈ సమస్యల్నించి గట్టెక్కి ముఖానికి నిగారింపు తీసుకురావాలంటే ఈ ఐదు ఫేస్ ప్యాక్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.

1 /5

శెనగపిండి అల్లోవెరా ఫేస్ ప్యాక్ శెనగపిండి అల్లోవెరా జెల్ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉండే నల్లదనాన్ని దూరం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజూ ముఖానికి రాయవచ్చు. ముఖంపై ఉండే వ్యర్ధాల్ని చర్మం లోపల్నించి క్లీన్ చేయగలదు. 

2 /5

శెనగపిండి తేనె ఫేస్ ప్యాక్ శెనగపిండి తేనె ఫేస్ ప్యాక్ ముఖానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వేసవిలో ముఖం నల్లబడకుండా, కాంతి కోల్పోకుండా కాపాడుతుంది. ట్యానింగ్ సమస్యను దూరం చేస్తుంది. రోజ్ వాటర్ కలిపితే ముఖంపై కొత్త నిగారింపు వస్తుంది.

3 /5

పసుపు పెరుగు ఫేస్ ప్యాక్ పసుపు పెరుగు ఫేస్ ప్యాక్ రాయడం వల్ల ముఖానికి కొత్త కాంతి వస్తుంది. ట్యానింగ్ దూరం చేయవచ్చు. వారానికి రెండు సార్లు రాస్తే చాలు. ముఖంపై ఉండే ఇతర సమస్యలు కూడా దూరమౌతాయి. ఇందులో రోజ్ వాటర్ మిక్స్ చేస్తే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది. 

4 /5

పుచ్చకాయ ఫేస్ ప్యాక్ వేసవిలో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. లేకపోతే ముఖం నిర్జీవంగా మారుతుంది. తీవ్రమైన ఎండల కారణంగా చర్మంపై ఉండే తేమ పోతుంది. ఈ పరిస్థితుల్లో అందం దెబ్బతినకుండా ఉండాలంటే పుచ్చకాయ ఫేస్ ప్యాక్ మంచి ఫలితాలనిస్తుంది. ముఖం నల్లబడదు. చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది.

5 /5

పసుపు శెనగ పిండి ఫేస్ ప్యాక్ వేసవిలో చెమట కారణంగా చాలా చికాకు ఉంటుంది. ముఖ చర్మం దెబ్బతింటుంది. ముఖ్యం నల్లగా మారిపోతుంది. ఎండ, చెమట కారణంగా ట్యానింగ్ సమస్య తలెత్తుతుంది. అందుకే పసుపు శెనగపిండి ఫేస్ ప్యాక్ ముఖానికి రాసుకుంటే ట్యానింగ్ సమస్య దూరమౌతుంది. ముఖం నిగనిగలాడుతుంది.