Summer Vegetables: వేసవి వచ్చిందంటే చాలు కొన్ని ఇబ్బందులు తప్పవు. అందులో ముఖ్యమైనవి జీర్ణ సంబంధిత సమస్యలు. డీ హైడ్రేషన్, బయటి తిండి తినడం, దినచర్య సరిగ్గా లేకపోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంటుంది. ఈ సమస్యల్నించి బయటపడేందుకు డైట్‌లో కొన్ని కూరగాయలు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. తద్వారా జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు.
టొమాటో టొమాటోను చాలా మంది విరివిగా ఉపయోగిస్తారు. టొమాటోలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దాంతోపాటు కడుపు అల్సర్ వంటివాటిని నియంత్రిస్తుంది.
కీరా కీరాలో నీళ్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కీరా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.
పాలకూర పాలకూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు క్లీన్ అవుతుంది.
కాకరకాయ కాకరకాయ చేదుగా ఉన్నా ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. చాలా ప్రయోజనాలుంటాయి. కాకరకాయ అనేది జీర్ణక్రియ ఎంజైమ్స్‌ను ఉత్తేజితం చేస్తుంది. దాంతో తిన్న ఆహారం చాలా సులభంగా జీర్ణమౌతుంది. కాకరకాయ జ్యూస్ లేదా ఫ్రై ఇందుకు మంచి ప్రత్యామ్నాయం. గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు మాత్రం కాకరకాయకు దూరంగా ఉంటే మంచిది.
ఆనపకాయ ఆనపకాయ రుచికే కాకుండా జీర్ణక్రియకు సైతం అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో నీరు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆనపకాయ కూర లేదా పప్పుతో కలిపి ఎలాగైనా వండుకోవచ్చు.